బహిరంగంగా అభిమానులకు క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ హీరో... ఏం జరిగిందంటే?

బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా అక్షయ్ కుమార్ మంచి గుర్తింపు పొందాడు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన అక్షయ్ కుమార్ సినిమాలతో పాటు కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటాడు.

 The Bollywood Hero Publicly Apologized To The Fans Do You What Happened Akshya-TeluguStop.com

అందరి నటీ, నటులలాగే అక్షయ్ కుమార్ కూడా కమర్షియల్ యాడ్స్ లో నటించి అధిక మొత్తంలో సంపాదిస్తున్నాడు.అయితే ఇటీవల షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ కలిసి ఒక పొగాకు సంబంధిన యాడ్ లో నటించారు.

అక్షయ్ కుమార్ ఈ యాడ్ లో నటించడంతో అతని అభిమానులు తీవ్ర వ్యతిరేకత తెలియజేస్తున్నారు.

గత కొంతకాలంగా అభిమానుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న అక్షయ్ కుమార్ ఇటీవల ఈ విషయం గురించి మాట్లాడారు.

గత కొన్ని రోజులుగా అభిమానుల నుండి వస్తున్న వ్యతిరేక స్పందన తనను ఎంతగానో బాధ పెట్టిందని అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశాడు.ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఒక బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశారు.

గత కొన్ని రోజులుగా అజయ్ దేవగన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ కలసి నటించిన పొగాకు సంబంధించిన యాడ్ ఒకటి ప్రసారమవుతుంది.తమ అభిమాన హీరో ఇలా యువత భవిష్యత్తును తప్పు దారి పట్టేలా ఇలాంటి ప్రకటనలలో నటించటం వల్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.

ఆ ప్రకటన నుండి తప్పుకోవాలని సోషల్ మీడియా వేదికగా అక్షయ్ ని కోరారు.

Telugu Ajay Devgn, Akshay Kumar, Akshya Kumar, Apologized, Bollywood, Fans, Shahఅక్షయ్ కుమార్ ఎట్టకేలకు తనపై వస్తున్న వ్యతిరేకత స్పందన గురించి రియాక్ట్ అయ్యాడు.ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.” గత కొన్ని సంవత్సరాలుగా తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు.నేనెప్పటికి పొగాకుకి వ్యతిరేకంగా ఉంటాను.నన్నెంతగానో అభిమానించే మీ అందరి అభిప్రాయం వల్ల ఆ యాడ్ నుండి తప్పుకుంటున్నాను.కాంట్రాక్ట్ ఉండటం వల్ల న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ యాడ్ కొనసాగుతూ ఉంటుందని చెప్పాడు.ఇకపై భవిష్యత్తులో ప్రతి విషయం మీద జాగ్రత్తలు తీసుకుంటా” అని అభిమానులకి మాటిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube