సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం విదితమే.పరశురామ్ పెట్ల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి చార్ బస్టర్ గా నిలిచాయి.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ పాట కోసం అభిమానులంతా ఎదురు చూసారు.
ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.అయితే తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ తెలిపారు.
ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోసం సర్కారు వారి పాట టీమ్ ఈ అప్డేట్ ఇచ్చింది.

అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారట.ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూర్తి అయ్యిందని.ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే.
ఇకపై రెగ్యులర్ గా ట్వీట్ చేస్తూనే ఉంటామని చెప్పిన విషయం కూడా తెలిసిందే.ఈ క్రమంలోనే మేకర్స్ చెప్పినట్టుగానే తాజాగా మరొక అప్డేట్ ను పంచుకున్నారు.

తాజాగా మిగిలి ఉన్న లాస్ట్ సాంగ్ షూట్ స్టార్ట్ అయ్యిందని ప్రకటించారు మైత్రి మూవీ మేకర్స్.మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ మరొకటి కూడా ఉంది.ఈ షూట్ కు సంబంధించిన పిక్స్ కూడా షేర్ చేయనున్నారట.సర్కారు టీమ్ ఈ రోజు రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాలోని 5వ సాంగ్ షూట్ స్టార్ట్ చేసారు.
మరి ఈ సాంగ్ కు సంబంధించిన ఫొటోస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.







