అమెరికాలో కన్నుల పండువగా సీతారామ కళ్యాణం..!!!

తెలుగు పండుగలలో తెలుగు వారందరికీ ఇష్టమైన పండుగ శ్రీరామ నవమి ఇదే రోజున సీతా రామ కళ్యాణం నిర్వహించుకుని భక్తి శ్రద్దలతో తెలుగు లోగిళ్ళు నిండిపోతాయి.

రామాలయాల వద్ద వడపప్పు పానకం కోసం చిన్నా పెద్దా బారులు తీరుతారు.

కళ్యాణ రామయ్యను ఊర్గిస్తూ మంగళ వాయిద్యాలతో ఎంతో భక్తి శ్రద్దలతో ఆయన్ని పూజిస్తారు.ఇదంతా మనం శ్రీరామ నవమి రోజున ప్రతీ గ్రామంలో చూస్తూనే ఉంటాం.

అయితే రాష్ట్రాన్ని విడిచి ఎల్లలు దాడి వెళ్ళినా మన తెలుగు సాంప్రదాయలను, పండుగలను ఏ మాత్రం మరచిపోని తెలుగు ఎన్నారైలు శ్రీరామ నవమిని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు.వివరాలలోకి వెళ్తే.

అగ్ర రాజ్యం అమెరికాలో స్థిరపడిన తెలుగు ఎన్నారైలు అక్కడి పలు రాష్ట్రాలలో శ్రీరామ నవమి ఎంతో వైభవంగా భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు.లాస్ ఏంజిల్స్ పరిసరప్రాంతాలలో ఉన్న తెలుగు ఎన్నారైలు కలిసి శ్రీరామ నవమిని నిర్వహించుకున్నారు.

Advertisement

ఉదయం 8 గంటలకు మొదలైన కళ్యాణ మహోశ్చవం మధ్యాహ్నం భోజనంతో ముగిసింది.భద్రాచలంలో ప్రత్యేక పూజల నడుమ అమెరికాకు తీసుకువెళ్ళిన ఉత్సవ మూర్తుల విగ్రహాలను భారీ ఊరేగింపుగా గోవింద, రామ నామ స్మరణలతో ఊరేగించారు.

సుమారు 50 మంది మహిళలు కోలాటం ఆడుతూ ప్రత్యేక ప్రదర్సన ఇచ్చారు.చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న తెలుగు వారు సైతం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు.

దాదాపు 700 మంది పైగా తెలుగు వారు సాంప్రదాయబద్దమైన వేషధారణలో సీతారామ కళ్యాణానికి హాజరయ్యారు.ప్రతీ ఒక్క తెలుగు కుటుంభం అక్కడి పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో కోలాహలంగా కళ్యాణాన్ని జరిపించారు.

ఇదిలాఉంటే ఇక్కడి కమ్యూనిటీ కి చెందిన తెలుగు కుటుంబాలు సుమారు 7 ఏళ్ళ నుంచీ సీతారామ కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్నాయని, మన పండుగలను, సాంప్రదాయలను పిల్లలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాలలో వారిని భాగస్వాములు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొని విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరికి స్థానిక తెలుగు కమ్యూనిటీ కృతజ్ఞతలు తెలియజేసింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు