బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎలా సినిమాలో విలన్ పాత్రలో నటించిన నిజజీవితంలో మాత్రం ఓ మంచి మనసున్న హీరో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కరుణ వంటి విపత్కర సమయంలో సోదరులు చేసిన సేవలు గురించి అందరికీ తెలిసిందే.ఇప్పటికీ ఎవరైనా ఆపదలో ఉన్నారు అని తెలిస్తే వెంటనే వారికి అండగా నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ వారికి సహాయం చేస్తుంటారు.
ఇదిలా ఉండగా తాజాగా ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా సోనుసూద్ కిఒక విన్నపం చేశారు ఈ క్రమంలోనే ఈ విషయంపై సోనుసూద్ స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే సదరు నెటిజన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.
సోదరా మీరు ఎంతో మందికి సహాయం చేస్తున్నారు.నాకు కూడా ఒక చిన్న సహాయం చేయండి.
నా భార్య ఎక్కువగా నా రక్తం తాగే స్తోంది దానికి మీ దగ్గర ఏమైనా చికిత్స ఉందా దయచేసి సహాయం చేయండి అంటూ ట్వీట్ చేశారు.ఒక భార్య బాధితుడిగా మిమ్మల్ని రెండు చేతులు జోడించి సహాయం కోరుతున్నాను అంటూ ఆయన తన బాధను వెల్లడించారు.

ఈ క్రమంలోని ఈ ట్వీట్ పై సోనుసూద్ స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.ఈ సందర్భంగా సోను సూద్ సమాధానం చెబుతూ అది భార్య జన్మహక్కు సోదరా… మీరు కూడా నాలాగే అదే రక్తంతో ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టండి అంటూ సోనుసూద్ సదరు నెటిజన్లకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.ఈ క్రమంలోనే సోనుసూద్ సమాధానం చూసిన నెటిజన్లు భలే సమాధానం చెప్పారు సోదరా అంటూ కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







