టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తర్వాత సినిమాలపై దృష్టి పెట్టాడు.ఒకవైపు రాజకీయాలలో పాల్గొంటూనే మరోవైపు సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఇక మధ్యమధ్యలో కెమెరాల ముందు ఫిట్నెస్ గా కనిపించడం కోసం ఫిట్ నెస్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ తన తర్వాత సినిమా అయినా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఈ సినిమాకు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్ విషయంలో కసరత్తులు చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమా పిరియాడిక్ హిస్టోరికల్ సినిమాగా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో పవన్ పాత్ర డిఫరెంట్ గా ఉండబోతోంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు.

అలాగే ఇందులో పవన మూడు డిఫరెంట్ షేడ్స్ లో స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని తెలియడంతో అభిమానులు ఈ విషయం చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు.కొన్ని నెలలుగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో పవన్ కళ్యాణ్ మళ్ళీ జాయిన్ అయ్యారు.
పవన్ ప్రాక్టీస్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, ఆ ఫోటో లో ని బండ్ల గణేష్ షేర్ చేస్తూ గన్ను పట్టిన పెన్ను పట్టిన కత్తి పట్టిన మైకు పట్టిన ఏది పట్టిన ఎవరి పై గురి పెట్టిన మీకు తిరుగులేదు దేవర అని కామెంట్ చేస్తూ ట్వీట్ చేశాడు.ఈ ట్వీట్ ఫై పవర్ స్టార్ ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నాడు.
ఇకపోతే ఈ హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇది అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.







