ఇదేందయ్యా ఇది: భారత్ లో కంగారూల పెంపకం..!?

సాధారణంగా కంగారూలను మనం ఆస్ట్రేలియాలో చూస్తుంటాం.అయితే దాదాపు ఆస్ట్రేలియాలో తప్ప ఇతర దేశాల్లో పెద్దగా కనిపించని కంగారూలు అకస్మాత్తుగా భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ లో ప్రత్యక్షమయ్యాయి.

 Kangaroo Breeding In India Kangaroo, Latest News, Viral Latest, Viral News, Soc-TeluguStop.com

పశ్చిమ బెంగాల్ లోని ఓ రెండు ప్రాంతాల్లో కంగారూలు కంగారూలు కనిపించడంతో వాటిని కొందరు వీడియాలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.ఆ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే.ఆస్ట్రేలియాలోని టాస్మేనియా, న్యూగినియాలో ప్రాంతాల్లో తప్ప కంగారూలు ఎక్కడా కనిపించవు.

అలాంటిది ఈ కంగారూలు ఎక్కడినుంచి వచ్చాయనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కృత్రిమంగా కంగారూలను పెంచి… వాటిని అక్రమ రవాణా చేస్తున్నారని కొన్ని మాటలు వినిపిస్తున్నాయి.

పోయిన వారం అటవీ అధికారులు పశ్చిమ బెంగాల్ లోని గజోల్‌ దోబా ప్రాంతంలో గాయాలతో తిరుగుతూ కంగారూలు కనిపించాయి.ఈ కంగారూలను చికిత్స నిమిత్తం బంగాల్ సఫారీ పార్క్‌కు తరలించారు.

ఇవి ఎక్కడ నుండి వచ్చాయి.ఎవరు వీటిని ఇక్కడకు తీసుకొచ్చారు అనే దానిపై అటవీ శాఖ అధికారులు.

పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ దర్యాప్తులో స్మగ్లర్లు భారత దేశానికి తీసుకొచ్చినట్లు తెలిసింది.

స్మగ్లర్ల నుంచి తప్పించుకున్న కంగారూలు… రోడ్లపైకి వచ్చినట్లు తెలిసింది.వీటితో పాటు.

ఈశాన్య రాష్ట్రాల్లో కంగారూలను కృత్రిమంగా పెంచి, వాటిని అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.దానికంటే ముందే.

కంగారూను అక్రమంగా తరలిస్తుండగా అలిపుర్‌దౌర్ జిల్లాలో అధికారులు పట్టుకున్నారు.కృత్రిమ గర్భధారణ ద్వారా కంగారూలను మిజోరంలో పెంచుతున్నారని జల్‌పాయ్‌గుడి సైన్స్ అండ్ నేచర్ క్లబ్ సెక్రటరీ పేర్కొన్నారు.

అలా పెరిగిన వాటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.దీనిపై ప్రభుత్వం దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube