ప్రముఖ న్యూస్ అగ్రిగేటర్ కంపెనీలలో ఒకటైన డైలీహంట్ కు దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉందనే సంగతి తెలిసిందే.షార్ట్ వీడియో యాప్ అయిన జోష్ కు సైతం రోజురోజుకు పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.
అయితే ఈ రెండు కంపెనీలకు పేరెంట్ కంపెనీ అయిన Verse Innovation తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో వృద్ధితో దూసుకెళుతూ ఉండటం గమనార్హం.ఈ సంస్థ తాజాగా ఒక ప్రకటనలో 805 మిలియన్ డాలర్లను సమీకరించినట్టు తెలిపింది.
2007 సంవత్సరంలో ఈ సంస్థను శైలేంద్ర శర్మ, వీరేంద్ర గుప్తా మొదలుపెట్టగా 2018 సంవత్సరంలో ఉమంగ్ బేడీ ఈ సంస్థలో చేరారు.ఈ సంస్థ రాబోయే రోజుల్లో నూతన టెక్నాలజీలు అయిన వెబ్ 3.0, లైవ్ స్ట్రీమింగ్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.ఈ మధ్య కాలంలో టెక్నాలజీ స్టాక్ లు ఒత్తిడికి లోను అవుతున్నా ఈ సంస్థ మాత్రం తమకు పెట్టుబడిదారుల సపోర్ట్ ఉందని పేర్కొంది.
కొత్త టెక్నాలజీల ద్వారా ఈ సంస్థ లోకల్ లో పోటీనిస్తున్న సంస్థలతో పాటు అంతర్జాతీయంగా పోటీనిస్తున్న సంస్థలకు మరింత గట్టి పోటీని ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఇండియన్ స్టార్టప్ అంచనాలకు అందని స్థాయిలో నిధులను సమీకరించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో డైలీ హంట్ కు ఏకంగా 350 మిలియన్ల యూజర్లు ఉన్నారు.జోష్ యాప్ ను వినియోగించే యాక్టివ్ యూజర్ల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది.
ఈ సంస్థకు సంబంధించిన పబ్లిక్ వైబ్ కు కూడా యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.బిలియన్ల సంఖ్యలో యూజర్లకు సేవలందించే యాప్స్ పై ఈ సంస్థ ప్రధానంగా దృష్టి పెట్టి యూజర్లను ఆకట్టుకుంటోంది.
Verse Innovation తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో వృద్ధితో అంతకంతకూ ఎదుగుతుండటం గమనార్హం.







