ప్రపంచం లోనే అత్యంత ప్రజాధారణ పొందిన యాప్ గా స్పాటిఫై ముందుకు దూసుకెళ్తుంది.ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తమ యూజర్లను ఆకట్టుకుంటున్న ఈ యాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ తో యూజర్ల ముందుకు రానుంది.
ఇప్పుడు సంగీత ప్రియులు తమకు ఇష్టమైన పాటలను సులభంగా గుర్తించేలా ఓ కొత్త ఫీచర్ ను రెడీ చేస్తుంది.ఈ విషయాన్ని తన అఫీషియల్ బ్లాగ్ ద్వారా ప్రకటించింది.‘మా యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాం.వారు మ్యూజిక్ ని మరింత ఎంజాయ్ చేయడానికి వీలుగా ఇప్పుడు ప్లేజాబితా ను అందించడానికి మేము కృషి చేస్తున్నాం.
ఈ కొత్త ఫీచర్ గురించి తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం’ అని తమ కంపెనీ బ్లాగ్ లో స్పాటిఫై పేర్కొంది.
ఇప్పటికే పలు ప్లేజాబితాలను సంగీత ప్రియుల కోసం అందించి స్పాటిఫై కొత్త కొత్త విధానాలను శ్రోతలకు అందజేసినట్టు తెలిపింది.
తమ యూజర్లు నిరాశ పడకుండా మంచి సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. స్పాటిఫై యాప్ ను మొదటి స్థానంలో నిలపడమే తమ లక్ష్యమని అందుకోసం కొత్త కొత్త ఆవిష్కరణలు తేవడానికి కృషి చేస్తున్నామని.
అందులో భాగంగానే యూజర్లు తమకు ఇష్టమైన పాటలను సులభంగా యాప్ లో కనుగొనేలా కొత్త ఫీచర్ ప్లాం చేస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది.

ఇప్పటికే మన దేశంలో ఎన్నో రకాల మ్యూజిక్ యాప్స్ ఉన్నాయి.వాటికి పోటీగా స్ఫోటిఫై దూసుకెళ్తుంది.మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో స్పాటిఫై యాప్ కి మంచి డిమాండ్ ఉంది.
మొదట్లో భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టిన స్పాటిఫై కి ఎదురుదెబ్బ తగిలింది.కొన్ని అడ్డంకులను కూడా ఎదుర్కొంది.తర్వాత తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాప్ మ్యూజిక్ యాప్స్ లో ఒకటిగా నిలిచింది.







