తమిళనాడుకు చెందిన 82 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ముత్తు తన ఇంట్లో ఒక కుక్కను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు.లాబ్రడార్ జాతికి చెందిన ఈ పెంపుడు కుక్కను కుటుంబ సభ్యునిగా భావించాడు.
గతేడాది ముత్తు దగ్గరున్న పెంపుడు కుక్క చనిపోయింది.దీంతో అతడితో పాటు కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మీడియా కథనాల ప్రకారం, ముత్తు తన కుక్క జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించాడు. విశేషమేమిటంటే ఈ ఆలయంలో ఆయన కుక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.
తమపై విధేయత చూపిన శునకానికి విచిత్రంగా నివాళులర్పించిన ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపుతోంది.
ముత్తు మేనల్లుడు మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.
అతని సోదరుడు 11 ఏళ్ల క్రితం టామ్ అనే కుక్కను కొనుగోలు చేశాడు.అయితే దానిని తన వద్ద ఎక్కువ కాలం ఉంచుకోలేకపోయాడు.
ఆరు నెలల తర్వాత ఆ కుక్కను తన మామకు అప్పగించాడు.దీని తరువాత, టామ్ అతని దగ్గర 10 సంవత్సరాలకు పైగా ఉంది.
తన మేనమామ, కుక్క ఒకరికి ఒకరు అన్నట్లు ఉండేవారని, కుక్క చనిపోయిన తర్వాత లోటు ఏర్పడిందని మనోజ్ కుమార్ తెలిపాడు.

టామ్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉందని మనోజ్ కుమార్ తెలిపాడు.కుక్కకు చికిత్స అందించినప్పటికీ దానిని రక్షించలేకపోయాడు.జనవరి 2021లో అనారోగ్యం కారణంగా కుక్క ప్రాణాలు కోల్పోయింది.
దీని తర్వాత ముత్తు 80 వేల రూపాయలు వెచ్చించి తయారు చేసిన నల్ల పాలరాతి కుక్క విగ్రహాన్ని కొనుగోలు చేశాడు.మనమదురై సమీపంలోని బ్రహ్మకురిచ్చిలో తన పొలంలో శునకానికి ఆలయాన్ని నిర్మించాడు.
దానిలో ఈ శునకం విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.







