హైదరాబాద్ లో ఉదయం భారీ ఎత్తున రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే.ఈ పార్టీ జరుగుతున్న సమయం లోనే పోలీసులు అక్కడికి వెళ్లి ఆ పార్టీని భగ్నం చేసి అందరిని అదుపులోకి తీసుకున్నారు.
రాడిసన్ బ్లు హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేయగా ఈ రేవ్ పార్టీ బయట పడింది… ఈ పార్టీలో దాదాపు 157 మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
అయితే వీరిలో పెద్ద ఎత్తులో సినీ సెలెబ్రిటీల పిల్లలు ఉన్నట్టు తెలుస్తుంది.
ఫండింగ్ మింక్ అనే పబ్ పై తెల్లవారు జామున 3 గంటల సమయంలో పోలీసులు పక్కా సమాచారం తో దాడి చేసారు.ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల అదుపులో డ్రగ్స్ తీసుకున్నవారు మాత్రమే ఉన్నారు.మిగతా వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపించినట్టు తెలుస్తుంది.

ఈ లిస్టులో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కూడా ఉంది.ఈమెకు పోలీసులు నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి పంపించినట్టు సమాచారం.అలాగే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంజారాహిల్స్ సిఐని సస్పెండ్ చేసారని టాక్.ఈ వ్యవహారంలో నాగబాబు కుమార్తె నిహారిక ను విచారించారు.ఆ తర్వాత కాసేపటి క్రితం పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి పంపించారు.

నాగ బాబు కూతురు నిహారిక తో పాటుగా మరొక ఐదుగురిని ఇప్పటి వరకు అదుపులో ఉంచుకుని నోటీసులు ఇచ్చి బయటకు పంపించారు.అక్కడికి డ్రగ్స్ ఎవరు తీసుకు వచ్చారు.అనే దానిపై పోలీసులు విచారణ జరుపు తున్నారు.
ఇప్పటికే మన టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు అనేక సార్లు సంచలనం సృష్టించిన ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.మరి ఇప్పుడు ఈ కేసు ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.







