బుక్ మై షోలో అరుదైన రికార్డును క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్.. ఏం జరిగిందంటే?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు ముందు విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటోంది.బుక్ మై షోలో తాజాగా ఈ సినిమా మరో రికార్డును క్రియేట్ చేసింది.

 Rare Record Created Rrr Movie In Book My Show Details, Book My Show, Rrr Movie,-TeluguStop.com

రౌద్రం రణం రుధిరం పేరుతో ఈ సినిమా తెరకెక్కగా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.రామరాజు, భీమ్ పాత్రలలో చరణ్, తారక్ మినహా మరెవరినీ ఊహించుకోలేమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమాలో నటించిన అలియా భట్, ఒలీవియా మోరిస్ లకు కూడా ఈ సినిమా సక్సెస్ కెరీర్ పరంగా ప్లస్ అయిందనే సంగతి తెలిసిందే.అలియా భట్ కు ఆర్ఆర్ఆర్ క్రేజ్ తో తెలుగులో మరికొన్ని సినిమాలలో ఆఫర్లు వస్తున్నాయి.

అయితే తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇప్పటివరకు 5,71,000 కంటే ఎక్కువమంది రేటింగ్ ఇవ్వడం గమనార్హం.ఈ సినిమా బుక్ మై షోలో 90 శాతానికి పైగా రేటింగ్ ను సొంతం చేసుకుంది.

ఆర్ఆర్ఆర్ మూవీ అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడంపై చరణ్, తారక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాకు మాత్రం కొందరు కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.

Telugu Alia Bhatt, Show, Rajamouli, Fans Happy, Ntr, Olivia Morris, Ram Charan,

ఆర్ఆర్ఆర్ సినిమా ఫుల్ రన్ లో ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లందరికీ భారీ లాభాలను అందిస్తుందనడంలో సందేహం అవసరం లేదు.అయితే బాహుబలి2 స్థాయిలో మాత్రం ఈ సినిమా లాభాలను అందిస్తుందని భావిస్తే మాత్రం నిరాశ తప్పదు.

ఫుల్ రన్ లో ఈ సినిమా 1,000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ ఇప్పటికే 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం గమనార్హం.

నిన్న, ఈరోజు కలెక్షన్లతో ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు దాదాపుగా సేఫ్ అయినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube