నల్గొండ జిల్లా:నాగార్జునసాగర్ ఆదిత్య పెట్రోల్ బంక్ లో ఘరానమోసం వెలుగుచూసింది.14 లీటర్లు పట్టే బైక్ పెట్రోల్ ట్యాంకులో బంక్ సిబ్బంది 17 లీటర్ల కొట్టడడంతో అనుమానంతో వచ్చిన వాహనదారుడు మళ్ళీ పెట్రోల్ కొట్టించగా 14 లీటర్లే పట్టడడంతో అంతా అవాక్కయ్యారు.దీనితో బంకు వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బంక్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.పెట్రోల్ బంక్ లపై శాఖా పరమైన తనిఖీలు లేకపోవడంతో బంక్ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు.







