కెనడాలోని మాంట్రియల్‌లో వున్న Collège de comptabilité et de secretariat du Québec (CCSQ), College de I’Estrie (CDE), M కాలేజ్‌లు కోవిడ్ కారణంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.దీంతో క్రెడిట్ ప్రోటెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
ఈ క్రమంలోనే జనవరి 10న ఆకస్మాత్తుగా కాలేజీలు మూతపడ్డాయి.CCSQ కాలేజీ.
అకౌంటింగ్, సెక్రటేరియల్ స్టడీస్, మెడికల్, కంప్యూటింగ్, లీగల్ స్టడీస్‌లో వృత్తిపరమైన శిక్షణను అందిస్తోంది.CDE కాలేజీ.
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కోర్సులను అందిస్తోంది.M కాలేజీలో వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికతలో నాలుగు కోర్సులు అందజేస్తోంది.1,173 మంది భారత విద్యార్ధులు కెనడాలో వ్యక్తిగతంగా చదువుతుండగా.637 మంది విద్యార్ధులు కోవిడ్ కారణంగా భారత్‌లో ఇంటి నుంచి ఆన్‌లైన్ తరగతుల ద్వారా చదువుతున్నారు.ఈ మూడు కాలేజీలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూసివేయడంతో దాదాపు 2000 మంది భారతీయ విద్యార్ధులు రోడ్డునపడ్డ సంగతి తెలిసిందే.రైజింగ్ ఫీనిక్స్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న మూడు సంస్థలలో చేరిన భారతీయ విద్యార్ధులు.
ఆకస్మిక మూసివేత కారణంగా ఇబ్బందులు పడ్డారు.రోజులు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో విద్యార్ధులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే పలుమార్లు చండీగఢ్‌లో విద్యార్ధులు ఆందోళనకు దిగారు.వీరి పోరాటం ఫలించి సదరు మూడు కాలేజీలు తిరిగి తెరుచుకున్నాయి.
తరగతుల పున: ప్రారంభం వల్ల 2000 మంది భారతీయ విద్యార్ధులకు పెద్ద ఉపశమనం కలిగింది.అయితే కోవిడ్ కారణంగా భారత్‌లో ఆన్‌లైన్ ద్వారా చదువుకుంటున్న మరో 502 మంది విద్యార్దులకు కెనడా స్టూడెంట్ వీసా దొరుకుతుందో లేదోనన్న ఆందోళన నెలకొంది.
ఈ క్రమంలో తమ ఫీజు వాపసు కోసం వేచి చూస్తున్నారు.

గతేడాది ఆగస్టులో కోవిడ్ కారణంగా ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్న 502 మంది విద్యార్ధులకు కెనడా ప్రభుత్వం వీసాలు నిరాకరించింది.వీరంతా ఎప్పుడెప్పుడు కెనడాకు వెళదామా.క్యాంపస్‌లో ఫ్రెండ్స్‌ని కలిసి తరగతులకు హాజరవుదామా అని ఎదురుచూస్తున్నారు.
తమ బిడ్డలను బాగా చదివించుకునేందుకు గాను విద్యార్ధుల తల్లిదండ్రులు తమ జీవితకాల పొదుపును పొగొట్టుకోగా.మరికొందరు భారీగా అప్పులు చేశారు.
ఈ క్రమంలోనే విద్యార్ధులు తమకు న్యాయం చేయాల్సిందిగా క్యూబెక్‌లోని కోర్టును ఆశ్రయించారు.

భారత్‌లో చిక్కుకుపోయిన విద్యార్ధులు తాము చెల్లించిన డబ్బును పూర్తిగా రీఫండ్ చేయాలని లేదా కెనడాలో తమ చదువును కొనసాగించడానికి ప్రత్యేక వీసా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.ఆయా కళాశాలలు తొలుత నవంబర్ 30, 2021 నుంచి జనవరి 10, 2022 వరకు సుదీర్ఘ శీతాకాల సెలవులను ప్రకటించాయి.తర్వాత కాలేజీలను మూసివేయడానికి ముందు, వారంలోగా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య వున్న పెండింగ్ ఫీజును చెల్లించాలని ఆదేశించాయి.దీంతో కొందరు విద్యార్ధులు ఫీజు చెల్లించగా.మరికొందరు చెల్లించలేకపోయారు.







