ముస్లిం మైనార్టీల అభివృద్ధి మా లక్ష్యం..ఒక్కో మజీద్ కు లక్ష రూపాయల నిధులు మంజూరు: మంత్రి పువ్వాడ

స్వరాష్ట్రంలోనే పేద ముస్లింలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని,అన్ని కులాలు,మతాలను సమానభావంతో చూస్తున్న దమ్మున్న సెక్యులర్‌ నాయకుడు సీఎం కేసీఆర్‌ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు ప‌విత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరంలోని ప్రతి మజీద్ అభివృద్ధి కొరకు ఒక్కో మజీద్ కు లక్ష రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్‌ ముస్లింల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు ముస్లిం మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నదని, తెలంగాణలో వారి ఆటలు సాగవన్నారు.మతాలు, కులాల పేరిట వచ్చే పార్టీలను తరిమికొట్టాలన్నారు.

సమాజంలో గౌరవం పెరిగేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ముస్లిం ప్రజలు అండగా నిలువాలని కోరారు.కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో రాష్ట్రంలో కేవలం రెండు మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలుంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 240 మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇటీవల సీఎం కేసీఆర్‌ 90వేలకు పైగా ఉద్యోగాలు ప్రకటించారని, వాటిలో ముస్లిం మైనార్టీలు ఎక్కువ శాతం సాధించేలా కృషి చేయాలన్నారు.ఎంతోమంది పేద ముస్లిం విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు.

Advertisement

తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తు ఓ వైపు బతుకమ్మ చీరెలు, మరోవైపు క్రిస్మస్‌, రంజాన్‌ కానుకలు అందజేస్తున్నదని పేదలు పండుగ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్ధేశ్యంతో రంజాన్‌ తోఫాను అందజేస్తున్నదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు.

హీరోయిన్ సాయిపల్లవి మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా.. ఆమె జవాబు ఇదే!
Advertisement

Latest Khammam News