ధాన్యం కొనుగోలు విషయంలో వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాహుల్ గాంధీ ఒక నాన్సెన్స్…రేవంత్ రెడ్డి ఒక న్యూసెన్స్ అని జీవన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో ఐరెన్ లెగ్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.బీజేపీలో RRR, కాంగ్రెస్‌లో RR అనే దరిద్రులు మోపయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం కొనాలని కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ధర్నా చేశారన్నారు.కవిత ఒక తెలంగాణ అడబిడ్డగా ఒకే దేశం ఒకే ప్రోక్యుర్మెంట్ అనడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.
లోపల స్వీట్లు పంచుకుంటారు.బయట ట్వీట్లు చేసుకుంటారా అని వారిపై మండిపడ్డారు.
రాహుల్ గాంధీకి ఓట్లపై ప్రేమ ఉంది, కానీ రైతులపై ప్రేమ లేదన్నారు.రాహుల్ గాంధీ దేశంలో ఐరెన్ లెగ్ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
యూపీ, పంజాబ్‌లో అడుగు పెట్టగానే అధికారం కోల్పోయాయన్నారు.అక్కడ రాహుల్ గాంధీ.
ఇక్కడ రేవంత్ రెడ్డి ఐరెన్ లెగ్‌లు అని ఆయన అభివర్ణించారు.
రేవంత్ రెడ్డి వచ్చాక 40వేల ఓట్లు ఉన్న హుజురాబాద్‌లో 4వేల ఓట్లు కూడా రాలేదని ఆయన ఎద్దేవా చేశారు.
రైతుల కోసం టీఆరెస్ చేసిన కార్యక్రమాల తరహాలో కాంగ్రేస్ పార్టీ చేసిన పనేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.రాహుల్ గాంధీ ఒక నాన్ సెన్స్…రేవంత్ రెడ్డి ఒక న్యూసెన్స్ అని ఆయన పేర్కొన్నారు.
గాంధీ భవన్‌ను కాస్త రేవంత్ రెడ్డి కుస్తీ భవన్‌గా మార్చారని ఆయన ఆరోపించారు.రాహుల్ గాంధీ కుటుంబం అంతా వ్యవసాయంపై తెలుగులో మాట్లాడటం పెద్ద జోక్ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.







