ఆర్ఆర్ఆర్ మూవీ రిజల్ట్ కు సంబంధించి ఈ సినిమా విడుదలకు జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే.అందరూ ఊహించిన విధంగానే ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
రిలీజ్ కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేక పోవడంతో బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సత్తా చాటడం కష్టమేనని ప్రచారం జరిగింది.అయితే శని, ఆదివారాల్లో ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంది.
నాలుగు రోజుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్ఆర్ఆర్ మూవీకి 91.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.ఈరోజు కలెక్షన్లను కలిపితే ఆర్ఆర్ఆర్ మూవీ 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలీవుడ్ లో ఫుల్ రన్ లో ఈ సినిమా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తోంది.
చరణ్, తారక్ పోటా పోటీగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అంటే బ్లాక్ బస్టర్ అని ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది.ఈ తరం దర్శకులలో వరుసగా 12 సినిమాలతో విజయాలు అందుకున్న దర్శకుడిగా జక్కన్న పేరు మారుమ్రోగుతోంది.జక్కన్నకు బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ తో క్రేజ్ మరింత పెరిగింది.

టాలీవుడ్ హీరోలలో మెజారిటీ హీరోలకు రాజమౌళి ద్వారానే పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కుతోంది.రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా ఫిక్స్ కాగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మహేష్ ఈ సినిమాలో జేమ్స్ బాండ్ గా కనిపిస్తారని సమాచారం.







