మెగా హీరో వరుణ్ తేజ్ సాయి మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబి మరియు ఆయన సన్నిహితుడు సిద్దు ముద్ద కలిసి నిర్మించిన సినిమా గని.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని చాలా రోజులైంది.
కరోనా కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.చిత్ర యూనిట్ సభ్యులు విడుదల నేపథ్యంలో హడావుడి చేస్తున్నారు.
ఈ సినిమాని మొదట భీమ్లా నాయక్ సినిమా విడుదలైన రోజే విడుదల చేయాలని భావించారు.కానీ భీమ్లా విడుదల తేదీ మారక పోవడంతో ఈ సినిమాను వాయిదా వేయడం జరిగింది.
ఎట్టకేలకు ఈ సినిమా ఏప్రిల్ 8వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.విడుదల తేది దగ్గర పడుతున్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషనల్ కార్యక్రమాలను స్పీడ్ పెంచారు.
ఈ సినిమా ను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ నిర్మిస్తున్న కారణంగా అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు తన వంతు సహాయం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా ప్రతి ఒక్క సినీ అభిమాని కి నచ్చే విధంగా ఉంటుంది అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా అంచనాలను పెంచుతోంది ఉన్నాయి.
ఈ సినిమా కు తమన్ సంగీతాన్ని అందించగా ఆయన అందించిన పాటలు పర్వాలేదనిపించాయి.

తప్పకుండా ఈ సినిమా ఒక మంచి హిట్ సినిమాగా నిలుస్తుంది అంటూ వరుణ్ తేజ్ అభిమానులు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.అల్లు అర్జున్ గతంలో కొన్ని సినిమా లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు హాజరయ్యాడు.ఆ సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
కనుక ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకాన్ని మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ సెంటిమెంట్ ఎంత వరకు వర్కవుట్ అవుతుంది అనేది చూడాలి.







