రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన లైగర్ సినిమా కు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుని వారాలు గడుస్తోంది.ఆయినా ఇప్పటి వరకు విడుదల తేదీ కి సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
సినిమా ఆగస్టులో విడుదల చేస్తామని ప్రకటించారు.విడుదల తేదీ అనేది అన్ని రోజుల దూరం ఎందుకు పెట్టారంటూ చాలా మంది పూరి జగన్నాథ్ ని ప్రశ్నిస్తున్నారు.
భారీ గ్రాఫిక్స్ అంశాలు ఏమీ ఉండకున్నా ఎందుకు అన్ని రోజులు వెయిటింగ్ అంటూ కొందరు పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ టీం ప్రశ్నిస్తే.మరి కొందరు మాత్రం సరైన సమయం కోసం వెయిట్ చేసి మరీ అంత దూరాన ఉన్న విడుదల తేదీని అనౌన్స్ చేశారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు విజయ్ దేవరకొండ తదుపరి సినిమా విషయం లో ఒక క్లారిటీ అయితే వచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వం లో సమంత హీరోయిన్ గా విజయ్ దేవరకొండ సినిమా ఉంటుంది అని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కానీ అనూహ్యంగా పూరి జగన్నాథ్ జనగణమన సినిమా మొదలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
విజయ్ దేవరకొండ మళ్ళీ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో సినిమా అంటే ఎప్పటి వరకు ఉంటుంది తదుపరి సినిమా ఎప్పుడు ఉంటుంది అంటూ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.ఈ ఏడాది ఆగస్టులో లైగర్ సినిమా ను విడుదల చేయబోతున్నాం అంటూ పూరి ప్రకటించాడు.
వచ్చే ఏడాది ఆగస్టు లో విజయ్ దేవరకొండ జనగణమన సినిమా విడుదల చేయబోతున్నట్లు గా అధికారికంగా ప్రకటించారు.మరి శివ నిర్వాణ దర్శకత్వం లో మరియు కొరటాల శివ దర్శకత్వం లో సినిమాలు ఎప్పుడూ ఉంటాయి అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.







