తెలంగాణ రాజకీయాల్లో వరి ధాన్యం కొనుగోలు అంశం ఎంతగా సంచలనం సృష్టిస్తున్నదనేది మనం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తుండగా మిగతా రాష్ట్రాలలో అయితే ఎలాంటి విధానాన్ని అమలుపరుస్తున్నామో అదే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తామని కానీ తెలంగాణకంటూ ప్రత్యేకంగా ఒక విధానమంటూ లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ పైనే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ తమ రాజకీయ లబ్ధి కోసం రైతులను బలి చేస్తున్నారని తక్షణమే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన చివరి గింజ వరకు కొనాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అయితే ప్రస్తుతం తెలంగాణలో రైతుల ధాన్యం కొనుగోలు విషయంలోబీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటని, రైతు వ్యతిరేక విధానాలతో రైతులను క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజ కొనాలని, తెలంగాణలో పండిన చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రకంపనలు రేపుతోంది.
ఇక రాహుల్ గాంధీ ట్వీట్ తో ఇక కాంగ్రెస్ శ్రేణులు మరింత ఉత్సాహంగా వరి ధాన్యం కొనుగోలు అంశంపై పోరాడనున్నారు.మరి రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.







