దేశాన్ని సుధీర్ఘకాలం పాటు పాలించిన పార్టీ.దేశంలో పూరాతన పార్టీ.
పైగా వందేండ్ల చరిత్ర గల పార్టీ.ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీనే.
ఇంతటి ఘన చరిత్ర కలిగిన పార్టీ నేడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది.ఎటు చూసినా దిక్కుతోచని దుస్థతి నెలకొంది.
దీంతో పార్టీని ఎలా ముందుకు నడిపించాలి ? మోడీ హవాను ఎదుర్కొని ఎలా నిలబడాలి ? అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.ఈనేపథ్యంలో పార్టీకి వ్యూహకర్తల కోసం వెతుకులాడుతుండడం చర్చణీయాంశంగా మారింది.
ఒకవిధంగా చెప్పాలంటే 1990 దశకంలోనే కాంగ్రెస్ అనేక ఎదురుదెబ్బలు ఎదుర్కొంది.రాజీవ్ హథ్య తరువాత పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు.పార్టనుంచి బయటకు వచ్చిన వారే సొంత కుంపటి పెట్టుకుని కాంగ్రెస్‌ను జీవచ్ఛవంలా మార్చే ప్రయత్నం చేశారు.శరద్ పవార్ వంటి కీలక నాయకులు ఎన్సీపీ పేరుతో సొంత పార్టీ స్థాపించుకున్నారు.
పంజాబ్ నాయకులు కూడా పార్టీలు పెట్టుకున్నారు.అయినప్పటికీ పార్టీ పుంజుకుని తన సత్తా చాటింది.
పీవీ నరసింహారావు ప్రధానిగా దేశాన్ని సంస్కరణల దిశఘా నడిపించి ఆర్థికంగా పుంజుకునేలా చేసింది.

అలాంటి పార్టీ నేడు మోడీకి జంకుతుందన్న వాదన వినిపిస్తోంది.అసమ్మతి నేత బృందం జీ-23తో తలకుమించిన భారంగా మారుతోందని సమాచారం.అయితే గతంలో మాత్రం అసమ్మతి గళం వినిపించకుండా సోనియా చక్రం తిప్పిన విషయం విధితమే.
ఏపీలో తమ మాటను వినని వైఎస్ జగన్‌ను కట్టడి చేశారు.అలాంటి పార్టీ నేడు వ్యూహ లేమితో దిక్కులు చూడడం విచిత్రంగా ఉంది.

నిజానికి ఇంతపెద్ద పార్టీలో వ్యూహాలు లేవా ? వ్యూహాలు చేసే నాయాకులు లేరా ? అనే ప్రశ్న తలెత్తుతోంది.దీనికి తోడు పార్టీ నేతలందరూ ఏకతాటిపైకొచ్చేలా కనబడడం లేదు.అందరూ ఐక్యంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రతి ఒక్క నాయకుడు వ్యూహకర్తగా మారడం ఖాయం.ఆ దిశగా పార్టీ అధినేత్రి సోనియా అడుగులు వేస్తారా ? లేదా ? అన్నది వేచి చూడాలి.







