మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆయన నటించిన RRR సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో పాటు రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) కూడా కావడంతో చరణ్ తన పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇకపోతే రామ్ చరణ్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్లో ఈ మధ్యకాలంలో కొత్త ఇంటిని కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ ఇంటిని రామ్ చరణ్, ఉపాసన దంపతులు వారి అభిరుచికి అనుగుణంగా ఇంటర్నేషనల్ స్టైల్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, స్విమ్మింగ్ పూల్, పెయింటింగ్స్, జిమ్ సకల సదుపాయాలు ఉన్న ఇల్లు మరింత అందంగా కనిపించడం కోసం కొన్ని మార్పులు చేశారు.

సుమారు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఇంటిని రామ్ చరణ్ తన సొంతం చేసుకోవడం కోసం ఏకంగా 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.ఇలా తన అందమైన ఇంటిని తనకు నచ్చిన విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఇంటి కోసం రామ్ చరణ్ ఈ విధంగా 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంటిని కొనుగోలు చేశారు.ఇక రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.