కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్.డైరెక్ట్ ప్రశాంత్ నీల్, హీరో యష్ నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాతో దేశం మొత్తం ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీ వైపు చూసి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది.ఈ విధంగా దేశవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకున్న కేజిఎఫ్ సినిమా సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్ చాప్టర్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానుంది.
హీరో యష్, శ్రీనిధి శెట్టి కలిసి నటించిన ఈ సినిమా 14వ తేదీ విడుదల కానుండటంతో పెద్ద ఎత్తున చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని బెంగళూరులో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు.

ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ…మా సినిమా కోసం పిలువగానే, ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకల కోసం వచ్చిన ముఖ్య అతిథులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.అలాగే గత 8 సంవత్సరాల నుంచికెజిఎఫ్ ఫ్రాంచైజీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ చిత్ర బృందానికి ప్రశాంత్ నీల్ కృతజ్ఞతలు తెలిపారు.అలాగే మేము పడిన ఎనిమిదేళ్ల కష్టాన్ని పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కి అంకితం ఇస్తున్నానని, సినిమా ఇండస్ట్రీకి పునీత్ లేని లోటును ఎవరు తీర్చలేరు అంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పునీత్ రాజ్ కుమార్ కు అంకితమివ్వడం సరైన నివాళి అంటూ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.








