రామ్‌ 'ది వారియర్‌' విడుదల తేదీ వచ్చేసింది

ఇస్మార్ట్ హీరో రామ్ మరియు లింగు స్వామి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ది వారియర్.ఈ సినిమాలో ఉప్పెన సినిమా తో సెన్సేషనల్ సక్సెస్ను దక్కించుకొని తెలుగు ప్రేక్షకులతో కీర్తించబడుతున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

 Ram The Warrior Movie Release Date , Ram, The Warrior , Lingu Swammy, Krithi S-TeluguStop.com

ఈ సినిమా లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరో గా అత్యంత పవర్ఫుల్ రోల్ ను ప్రదర్శించ బోతున్నారు అని ఫస్ట్ లుక్ ను చూస్తుంటే అర్ధం అవుతుంది.ఈ సినిమా విడుదల తేదీ విషయం లో గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్కు తెర తీయడం జరిగింది.

ఈ సినిమా ను జులై నెలలో విడుదల చేయబోతున్నట్లు సభ్యులు అధికారికంగా ప్రకటించారు.జూలై 14 వ తారీఖున సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం యూనిట్ సభ్యులు ఈ పోస్టర్ను విడుదల చేసి ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం అవుతుంది.

ఈ సినిమాకు రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించడం తో ఖచ్చితంగా మ్యూజికల్ సెన్సేషనల్ గా ఈ సినిమా నిలుస్తుంది అంటూ ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Telugu Devi Sri Prasad, Krithy Shetty, Lingu Swamy, Relese, Warrior-Movie

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా దర్శకుడు లింగుస్వామి అత్యంత కీలకంగా మారింది.తమిళంలో స్టార్ దర్శకుడి గా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు అక్కడ అవకాశాలు లేక డీలా పడి పోయాడు.అందుకే ఈ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా అక్కడ మళ్లీ బిజీ అవుతాడు, తెలుగు తో పాటు తమిళంలో కూడా ఈ సినిమా ను జూలై 14 వ తారీఖున భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే అవకాశాలు క్లియర్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube