రామ్‌ 'ది వారియర్‌' విడుదల తేదీ వచ్చేసింది

ఇస్మార్ట్ హీరో రామ్ మరియు లింగు స్వామి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ది వారియర్.

ఈ సినిమాలో ఉప్పెన సినిమా తో సెన్సేషనల్ సక్సెస్ను దక్కించుకొని తెలుగు ప్రేక్షకులతో కీర్తించబడుతున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరో గా అత్యంత పవర్ఫుల్ రోల్ ను ప్రదర్శించ బోతున్నారు అని ఫస్ట్ లుక్ ను చూస్తుంటే అర్ధం అవుతుంది.

ఈ సినిమా విడుదల తేదీ విషయం లో గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్కు తెర తీయడం జరిగింది.

ఈ సినిమా ను జులై నెలలో విడుదల చేయబోతున్నట్లు సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

జూలై 14 వ తారీఖున సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం యూనిట్ సభ్యులు ఈ పోస్టర్ను విడుదల చేసి ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం అవుతుంది.

ఈ సినిమాకు రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించడం తో ఖచ్చితంగా మ్యూజికల్ సెన్సేషనల్ గా ఈ సినిమా నిలుస్తుంది అంటూ ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. """/"/ భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా దర్శకుడు లింగుస్వామి అత్యంత కీలకంగా మారింది.

తమిళంలో స్టార్ దర్శకుడి గా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు అక్కడ అవకాశాలు లేక డీలా పడి పోయాడు.

అందుకే ఈ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా అక్కడ మళ్లీ బిజీ అవుతాడు, తెలుగు తో పాటు తమిళంలో కూడా ఈ సినిమా ను జూలై 14 వ తారీఖున భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే అవకాశాలు క్లియర్ అయ్యాయి.

కోల్‌కతా హత్యాచారం: వైద్యుల భద్రతపై.. రాష్ట్రపతి, ప్రధానికి భారత సంతతి డాక్టర్ల లేఖ