సముద్రంలో లోతుగా డైవింగ్ చేయడం ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో అంతే భయంగానూ ఉంటుంది.ఎందుకంటే సముద్రంలో మనుషులపై దాడి చేసే సొరచేపలు ఉంటాయి.
అలాగే సముద్రంలో ఇంకా భయంకరమైన జలచరాలు ఎన్నో ఉంటాయి.వీటిలో కొన్ని జీవులు తమ జోలికి వెళ్తే తప్ప దాడి చేయవు.
కానీ కొన్ని మాత్రం అగ్రెసివ్ గా మీద పడిపోతాయి.తాజాగా కూడా ఉత్తి పుణ్యానికి ఒక స్వార్డ్ ఫిష్.
.డీప్ సీ డైవర్ పై ఒళ్ళు గగుర్పొడిచే దాడికి పాల్పడింది.
దీనికి సంబంధించిన 57 సెకన్ల వీడియోని ఒక ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.ఇప్పుడు ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే, ఒక డైవర్ బ్రెజిల్ దేశంలోని ఒక సముద్రంలో దాదాపు 721 అడుగు లోపలికి వెళ్ళాడు.తర్వాత సముద్ర గర్భంపై నడుస్తూ అక్కడి అందాలను వీక్షించాడు.ఇంతలోనే అయిదడుగుల భయంకరమైన స్వార్డ్ ఫిష్ అతడి వైపు దూసుకొచ్చింది.ఆ తర్వాత కత్తిలా చాలా పొడువుగా ఉన్న తన ముక్కుతో అతడిపై దాడి చేసింది.ఈ క్రమంలో డైవర్ ధరించిన ఆక్సిజన్ ట్యాంక్ లో ఆ చేప ముక్కు చిక్కుకుపోయింది.ఈ ఆక్సిజన్ ట్యాంక్ నుంచి బయటపడేందుకు అది చాలా ప్రయత్నించింది.
పెద్ద చేప తనపై దాడి చేయడంతో బాగా భయపడిపోయిన డైవర్ అక్కడి నుంచి బయట పడేందుకు ఒక తాడు పట్టుకుని పైకి వెళ్లాడు.అనంతరం డైవింగ్ బెల్ లోకి వెళ్లి తన ప్రాణాలను రక్షించుకున్నాడు.
ఈ దృశ్యాలను తోటి డైవర్ తన కెమెరాలో క్యాప్చర్ చేశాడు.ఈ సమయంలో వీరిద్దరూ టార్చ్ ఉపయోగించడం వల్ల అక్కడ ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్టు కనిపించింది.
ఈ ఘటన 2016లో జరగగా దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది.ఇది చూసిన నెటిజన్లు పెద్ద గండం తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.







