గత మూడు సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేమికులు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆశగా ఎదురు చూశారు.ఇక ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం అత్యధిక థియేటర్లలో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా కోసం మూడు సంవత్సరాల నుంచి ప్రేక్షకులు ఎంతగా అయితే ఎదురు చూశారో చిత్ర బృందం కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని సినిమా చూస్తేనే మనకు అర్థమవుతుంది.ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా చూసిన అభిమానులు పెద్ద ఎత్తున సినిమా పై ప్రశంశలు కురిపిస్తున్నారు.
ఇక ఈ సినిమాకి వచ్చిన ప్రేక్షకాదరణ చూసి ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి స్పందించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు.
అవే నన్ను ముందుకు నడిపిస్తాయి.విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి ఆనందించండి అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రేక్షక అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా తెరపై కనిపించి ప్రేక్షకులను సందడి చేశారు.ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ల దగ్గర రచ్చ చేస్తున్నారు.కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.







