తెలంగాణ వరి ధాన్యం కొనాల్సిందే..ఢిల్లీలో తేల్చుకునే వస్తాం:-మంత్రి పువ్వాడ.

తెలంగాణ వడ్లను కేంద్రం కొనాల్సిందే అని,పంజబ్ కి ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం ఉంటదా అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేంద్రంపై ద్వజమెత్తారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలను పెంచినందుకు నిరసనగా తీసుకోబోయే కార్యాచరణలో భాగంగా ఖమ్మం vdo’s క్యాంప్ కార్యాలయంలో ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న టిఆర్ ఎస్ శ్రేణులతో మంత్రి పువ్వాడ ఫోన్ ద్వారా మాట్లాడారు.

 Telangana Rice Grain Konalsinde .. Will Come To Settle In Delhi: -minister Puvad-TeluguStop.com

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.యాసంగిలో వడ్లు కొనమని కేంద్రం అండం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఅర్ గారి నాయకత్వములో మంత్రులబృందం రావడం ఢిల్లీకి జరిగిందన్నారు.కేంద్ర మంత్రితో నేడు భేటీ ఉందని, సానుకూల స్పందన రాని పక్షంలో కేసీఅర్ నాయకత్వములో బిజేపి మేడలు వంచి తాడో పేడో తేల్చుకొని కనిపిస్తామని స్పష్టం చేశారు.

పంట సేకరణలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఒక విధానం.పంజాబ్‌లో మరో విధానాన్ని అవలంభిస్తున్నదని మండిపడ్డారు.

తెలంగాణ భారతదేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు.సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ప్రస్తుతం రాష్ట్రంలో వరి ఎక్కువగా పండిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు నీళ్లున్నా వరి వేసుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు.

పండించిన పంటను కేంద్రం కచ్చితంగా కొనితెరల్సిందే అన్ని అన్నారు.తెలంగాణ బీజేపీ నేతలకు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనేందుకు ఒప్పించాలని హితవు పలికారు.

రైతుల ఆగ్రహనికి కమలం మాడిపోతుందని స్పష్టం చేశారు.రైతు వ్యతిరేక చట్టాల రద్దు, రాష్ట్రంలో వడ్ల కొనుగోలుపై, కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని, దేశంలో ఎక్కడాలేని పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని వివరించారు.దీనికి తోడు ప్రజలపై అదనపు భారాలు మోపే చర్యల్లో భాగంగనే ఇష్టానుసారంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను విచ్చలవిడిగా పెంచినందుకు పెద్ద ఎత్తున నిరసన ను తెలపాలని కోరారు.

తెలంగాణ వడ్లను కేంద్రం కొనాలని కొరుతు మంత్రుల్ని కలిసేందుకు ఢిల్లీ వచ్చామని, తేల్చుకునే తెలంగాణ వస్తామని మంత్రి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube