టాలీవుడ్ ప్రేక్షకులకు మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.నాగబాబు తెలుగులో చాలా సినిమాల్లో సహాయ పాత్రలు చేసి నటనలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక కొన్ని సినిమాలలో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు నాగబాబు.
అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలుగుతున్నాడు.
ఇక నాగబాబు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటాడు.ఎప్పటికప్పుడు నెటిజన్లతో సోషల్ మీడియాలో ముచ్చట పెడుతూనే ఉంటాడు.
ఇక అదే క్రమంలో నాగబాబు ఫేస్ బుక్ లో ఆస్క్ మీ అంటూ నెటిజన్లు ముందుకు వచ్చాడు.ఈ క్రమంలో జనసైనికులు నాగబాబుని వివిధ ప్రశ్నలు అడిగారు.
దాంతో సెటైరికల్ గా కోడి కత్తి, ఖైదీ, జైలు అంటూ కొన్ని వివాదానికి దారితీసే కామెంట్లు చేశాడు.

ఇక పరిశీలిస్తే ఈ పదాలకు ఆయనే ప్రశ్నలు వేసుకొని, ఆయనే సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇక దీన్ని బట్టి ఆయన ప్రశ్నలు జవాబులు ఎవరిని ఉద్దేశించినా విధంగా ఉన్నాయో మనకు అర్థమవుతుండగా.కొందరు జగన్ ను టార్గెట్ చేశారు అని అంటున్నారు.
ఇక కొంత మంది నెటిజన్లు వేసిన ప్రశ్నలకు నాగబాబు సమాధానాలు మరో స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు.

అందులో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్న విషయానికొస్తే.త్రిబుల్ ఆర్ లో రాజమౌళి ఏం కత్తి వాడారు సార్ అని అడుగుతాడు.దాంతో నాగబాబు స్వాగ్ స్టైల్లో కోడి కత్తి వాడారు అని సమాధానం చెబుతాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగబాబు ఆస్క్ మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వైరల్ గా మారాయి.







