స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.సినీ అభిమానుల మధ్య భారీ అంచనాలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది.
చరణ్, తారక్ లకు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే.రెమ్యునరేషన్లతో కలిపి 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ అంతకంతకూ వాయిదా పడటంతో వడ్డీల రూపంలోనే నిర్మాత దానయ్యపై ఊహించని స్థాయిలో భారం పెరిగిందని సమాచారం అందుతోంది.వరుస ఇంటర్వ్యూలతో ఆర్ఆర్ఆర్ హీరోలు బిజీగా ఉన్నారు.సోషల్ మీడియాలో కూడా రామ్ చరణ్, రాజమౌళి ఎంతో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.రాజమౌళి తను తీసే సన్నివేశాల విషయంలో ఏ మాత్రం రాజీ పడరనే సంగతి తెలిసిందే.

రాజమౌళికి ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్లు ఉన్నాయి.ఫేస్ బుక్ లో రాజమౌళికి 7.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.అయితే జక్కన్న మాత్రం ఫేస్ బుక్ లో ఎం.ఎం.కీరవాణిని మాత్రమే ఫాలో అవుతుండటం గమనార్హం.ట్విట్టర్ లో మాత్రం జక్కన్న 17 మందిని ఫాలో అవుతున్నారు.మరోవైపు రామ్ చరణ్ కు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్లు ఉండటం గమనార్హం.

ట్విట్టర్ లో చరణ్ కేవలం ఇద్దరిని మాత్రమే ఫాలో అవుతున్నారు.అందులో ఒకరు చిరంజీవి కాగా మరొకరు పవన్ కళ్యాణ్ కావడం గమనార్హం.రాజమౌళి, చరణ్ లతో పోల్చి చూస్తే తారక్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.సోషల్ మీడియాలో తారక్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగా ఉంది.తారక్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.







