విజయవాడ: ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.నాలుగు రోజులుగా పెగాసిస్ పై చర్చలు జరుగుతున్నాయి.
పెగాసిస్ పై నామీద పలు ఆరోపణలు వస్తున్నాయి.తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయేమోనని ప్రజాలకూ సందేహాలు కలుగుతున్నాయి.
సీనియర్ ఐపీఎస్ అధికారిగా నేను స్పందిస్తున్నాను.ప్రజల్లోని అనుమానాలు తేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.ఈ సాఫ్ట్ వేర్ కొనడం అసాధ్యమని కొద్ధి నెలల క్రితం డీజీపీ కార్యాలయం వెల్లడించింది.2015 నుండి 2019 మార్చి వరకు నిఘా విభాగం అధికారిగా నేను ఉన్నాను.ఏపీ ప్రభుత్వం నిఘా విభాగాధిపతిగా పని చేసిన సమయంలో జరిగినదానిపై క్లారిటీ ఇవ్వాలనుకున్నాను.నేను పని చేసిన సమయంలో ఏ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలోని ఎవ్వరూ పెగాసెస్ ను కొనలేదు.
వాడలేదు.ప్రజలంతా నిశ్చింతగా ఉండవచ్చు.
మే 2019 తర్వాత జరిగినదానికి నా వద్ద సమాచారం లేదు.లేనిపోని ఆరోపణలు, అసత్యాలు చేసి ప్రజలను కన్ఫ్యూజన్ కు గురి చేయొద్దు.
ఎప్పుడూ కొననిదానికి, వాడనిదానికి నేను సమాధానం చెప్పాల్సివస్తోంది.ఈరోజు సీఎస్ కు మూడు విజ్ఞాపన పత్రాలు ఇచ్చాను.
గతంలో రోడ్డుపై మీడియాతో మాట్లాడినందుకు, నా గత కేసు విచారణ అంశం, హైకోర్టులో నా సస్పెన్షన్ విషయాలను త్వరగా తేల్చాలని కోరాను.నాపై విచారణ సమయంలో అధికారులు తప్పుడు పత్రాలు సృష్టించారు.
గత ముడురోజులుగా నాపై వ్యక్తిత్వ హననం జరుగుతోంది.ఓ ప్రముఖ దినపత్రిక, ఓ ప్రముఖ ఛానల్ టీవీ, ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, ఎంపీ విజయసాయి రెడ్డి, స్వర్ణాంధ్ర, గ్రేట్ ఆంధ్రా, పయనీర్ లపై పరువు నష్టం దావా వేస్తాను.
దీనికోసం అనుమతి కావాలని సీఎస్ ను కోరాను.నాపై సస్పెన్షన్ వేటు వేసిన అనంతరం సీఎం పీఆర్ఓ పూడి శ్రీహరి నాపై దుష్ప్రచారం చేశారు.
ఫిబ్రవరిలో సస్పెండ్ చేస్తే తర్వాత ప్రభుత్వం దిశంబర్ లో ఛార్జ్ షీట్ చేశారు.ఫిబ్రవరి నుండి దిశంబర్ వరకు పూడి శ్రీహరి అనేక నిందలను ప్రచారం చేశారు.
కానీ ఛార్జ్ షీట్ లో శ్రీహరి చేసిన అవాస్తవ ప్రచార వివరాలు లేవు.ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు ప్రభుత్వానికి నష్టం జరిగినట్టు ఛార్జ్ షీట్ లో లేదు.

25వేల కోట్లు అవినీతి చేసినట్టు ప్రచారం చేశారు.30ఏళ్ళు దేశానికి సేవ చేసిన నాపై దేశ ద్రోహిగా ముద్ర వేసారు.30ఏళ్ళు ప్రాణాలకు తెగించిన నా క్యారెక్టర్ అసానినేషన్ చేశారు.పెగాసిస్ ఆరోపణలు కూడా ఇలాంటివే.
దుష్టులు దుర్మార్గుల నుండి ప్రజలని రక్షించి, నేను బలైపోయాను.దేశంలోని ప్రతీ వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది.
ప్రభుత్వ విధానాలను చర్యలను ప్రభుత్వ ఉద్యోగి విమర్శించకూడదు.నేను ప్రభుత్వ విధానాలను, చర్యలను, పాలసీలను విమర్శించను.
నాపై వస్తున్న ఆరోపణలను నాకున్న హక్కు ప్రకారం వివరణ ఇస్తున్నాను.ఏపీలోనే పుట్టాను.
ఇక్కడే పెరిగాను.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివాను.
సిగ్గు, లజ్జ, భయం, పౌరుషం ఉన్నాయి.లక్షలమంది సిబ్బందితో పనిచేశాను.
అవినీతి లేకుండా విధులు నిర్వర్తించాను.పెగాసిస్ అనేది ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్, హార్డ్ వేర్ పరికరాల మిశ్రమం.
ఇది మనకి సంబంధం లేకుండానే మన ఫోన్ డేటాను, కాల్స్ ను రికార్డ్ చేస్తారు.ప్రొజెన్, మాల్వేర్ అనే సాఫ్ట్వేర్ ల ద్వారా ఫోన్ కి వాట్సాప్ ద్వారా పంపి మన సమాచారాన్ని అవతల వ్యక్తికి పంపుతాయి.
ఇందులో సింగల్ క్లిక్, డబుల్ క్లిక్ టెక్నాలజీలు ఉన్నాయి.వీటిని ఎప్పుడూ కొనలేదు.వినియోగించలేదు… మా కుమారుడికి ఇలాంటి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినట్టు పూడి శ్రీహరి ప్రచారం చేశారు.నాకు ఇంకా రెండేళ్లు సర్వీస్ ఉంది.
పశ్చిమబెంగాల్ లో మమతాబెనర్జీ మాట్లాడిన వీడియోలు ఎక్కడా లేవు.ఆమె మాట్లాడిన తర్వాత అక్కడి అధికారులను ఆరా తీసాను.
పెగాసిస్ సాఫ్ట్వేర్ అమ్మడానికి వచ్చిన వ్యక్తి చంద్రబాబుకు అమ్మానని చెప్పి ఉండొచ్చని అదే ఉద్దేశంలో ఆమె అలా అన్నారని చెప్పారు.గతంలో వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్నపుడు ఢిల్లీ హైకోర్టులో, సజ్జల రామకృష్ణ రెడ్డి అమరావతి హైకోర్టులో తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ కేసులు వేశారు.
అధికారంలోకి వచ్చిన 6నెలల్లో వైవీ కేసు వెనక్కి తీసుకున్నారు.సజ్జల రామకృష్ణారెడ్డి వేసిన కేసుకు ఎవరూ రావటం లేదని కోర్టు డిస్మిస్ చేసింది.
ప్రతీ 6నెలలకు ఒకసారి సీఎస్ సహా ఉన్నతాధికారుల కమిటీ ఒక సమావేశం జరుగుతుంది.