సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మరొక నాలుగు రోజుల్లో రాబోతుంది.ఇప్పుడా అప్పుడా అంటూ ఊరిస్తున్న ఈ సినిమా కోసం ఎదురు చూడని ప్రేక్షకులు లేరు.
బాహుబలి అంతటి ఘన విజయం తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్నా సినిమా ఇది.అందుకే మరింత హైప్ క్రియేట్ అయ్యింది.ఇప్పటికే వచ్చిన ప్రతీ అప్డేట్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్లాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే , ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుంది.

డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే.దాదాపు 500 కోట్లకు పైగానే బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పుకుంటున్నారు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా భారీ ప్రమోషన్స్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఆర్ ఆర్ ఆర్ టీమ్.ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఆసక్తికర విషయం తెలిపారు.

రాజమౌళి పై ఎన్టీఆర్ పంచ్ లు వేశారు.ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కి 65 నైట్స్ పట్టిందని వాటికంటే రాజమౌళి మరింత ఛాలెంజింగ్ గా అనిపించదు అంటూ సెటైర్స్ వేసాడు.ఈ సినిమాలో ఛాలెంజింగ్ గా అనిపించినా విషయం ఏంటి? అని అడిగితే ప్రతి సీన్ ఛాలెంజింగ్ గా అనిపించింది చెప్పాడు.అన్నింటి కంటే రాజమౌళి మరింత ఛాలెంజింగ్ గా అనిపించాడు.
ఎందుకంటే నేను నమ్మే కొంతమంది దర్శకులు 99% యాక్టింగ్ ఓకే అనుకుంటారు.కనీసం 99.5% అనుకుందాం.కానీ ఈయన మాత్రం అలా కాదు 100% కావాలి అంటారు.
నాకు 100% ఇచ్చి పక్కకు తప్పుకోండి అంటారు.అంటూ రాజమౌళి గురించి చెప్పు కొచ్చాడు.







