ఒక్క యాక్షన్ ఎపిసోడ్ ను 65 నైట్స్ షూట్ చేసారట.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
TeluguStop.com
సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మరొక నాలుగు రోజుల్లో రాబోతుంది.
ఇప్పుడా అప్పుడా అంటూ ఊరిస్తున్న ఈ సినిమా కోసం ఎదురు చూడని ప్రేక్షకులు లేరు.
బాహుబలి అంతటి ఘన విజయం తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్నా సినిమా ఇది.
అందుకే మరింత హైప్ క్రియేట్ అయ్యింది.ఇప్పటికే వచ్చిన ప్రతీ అప్డేట్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్లాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే , ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుంది.
"""/" /
డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే.
దాదాపు 500 కోట్లకు పైగానే బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పుకుంటున్నారు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా భారీ ప్రమోషన్స్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఆర్ ఆర్ ఆర్ టీమ్.
ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఆసక్తికర విషయం తెలిపారు. """/" /
రాజమౌళి పై ఎన్టీఆర్ పంచ్ లు వేశారు.
ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కి 65 నైట్స్ పట్టిందని వాటికంటే రాజమౌళి మరింత ఛాలెంజింగ్ గా అనిపించదు అంటూ సెటైర్స్ వేసాడు.
ఈ సినిమాలో ఛాలెంజింగ్ గా అనిపించినా విషయం ఏంటి? అని అడిగితే ప్రతి సీన్ ఛాలెంజింగ్ గా అనిపించింది చెప్పాడు.
అన్నింటి కంటే రాజమౌళి మరింత ఛాలెంజింగ్ గా అనిపించాడు.ఎందుకంటే నేను నమ్మే కొంతమంది దర్శకులు 99% యాక్టింగ్ ఓకే అనుకుంటారు.
కానీ ఈయన మాత్రం అలా కాదు 100% కావాలి అంటారు.నాకు 100% ఇచ్చి పక్కకు తప్పుకోండి అంటారు.
అంటూ రాజమౌళి గురించి చెప్పు కొచ్చాడు.