రెండుగా చీలిన కాంగ్రెస్ పార్టీ...కీలక నిర్ణయాలు ఖాయమేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.అయితే గత కొద్ది కాలంగా పార్టీ అంతర్గత విషయాలతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ఉంది.

 Congress Party Split In Two Are Key Decisions Permanent Telangana Congress, Rev-TeluguStop.com

ఇప్పుడిప్పుడే బలపడాలని ప్రయత్నిస్తున్న తరుణంలో సీనియర్ నేతలు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం, జగ్గారెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే రేవంత్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది.ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలినట్టు ప్రస్తుత పరిస్థితులను బట్టి మనకు కాస్త అర్ధమవుతున్న పరిస్థితి ఉంది.

నిన్న జరిగిన మన ఊరు- మన పోరు సభలో అద్దంకి దయాకర్ రావు వీ.హనుమంత రావుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి.

మన శత్రువుతో భేటీ అయి నా కుటుంబ అవసరం అని చెప్పడం సరికాదని పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని అద్దంకి దయాకర్ రావు అభిప్రాయ పడ్డారు.అయితే అద్దంకి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై ఇంకా హనుమంత రావు స్పందించకున్నా రానున్న రోజుల్లో స్పందించే అవకాశం ఉంది.

అయితే సీనియర్ నేతల సమావేశంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినా సమావేశాన్ని నిర్వహించడానికే మొగ్గు చూపిన పరిస్థితి ఉంది.

Telugu @revanth_anumula, Addankidayakar, Jagga Reddy, Rahul Ghandhi, Sonia Ghand

అయితే ఈ నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుందా లేక నేతలను మందలించి వదిలేస్తుందా లేక అసలు సమస్య ఏంటనే దానిపై సీనియర్ ల అభిప్రాయాలు వినే ప్రయత్నం చేస్తుందా అనేది చూడాల్సి ఉంది.ఎందుకంటే ఇంకా రోజురోజుకు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలో కలహాలతో ప్రజల్లో చర్చ జరిగితే పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉందని, అదే విధంగా గతంలో కంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube