విభీషణునికి గణేశునికి మధ్య యుద్ధానికి తార్కాణం ఈ ఆలయం

తమిళనాడులోని తిరుచిరాపల్లి (త్రిచ్చి) వద్ద రాక్ ఫోర్ట్ కొండపై ఉన్న ఉచ్చి పిల్లయార్ దేవాలయం ప్రసిద్ధ గణేశ దేవాలయాలలో ఒకటి.ఈ ఆలయం దాదాపు 273 అడుగుల ఎత్తులో ఉంది.

 Trucchi Pillayar Temple Story History , Trucchi Pillayar Temple  , Tiruchirappal-TeluguStop.com

ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 400 మెట్లు ఎక్కాలి.పర్వతాల మీద ఉండటం వల్ల ఇక్కడి దృశాలు చూడదగ్గవిగా ఉంటాయి.

ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది.ఈ ఆలయ నిర్మాణం వెనుక పుణాకకథ ఉందని చెబుతారు.

రావణుడిని సంహరించిన తరువాత రాముడు.రావణుడి సోదరుడు విభీషణుడికి విష్ణువు రూపమైన రంగ నాథుని విగ్రహాన్ని బహూ కరించినట్లు చెబుతారు.

విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్ల బోతుండగా అతనికి ఆటకం ఏర్పడింది.అతను రాక్షస వంశానికి చెందిన వాడు, దీంతో దేవత లంతా విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకకు వెళ్లడానికి ఇష్ట పడలేదు.

వారంతా తమకు సహాయం చేయమని వినాయకుడిని ప్రార్థించారు.ఆ విగ్రహం గురించి ఒక నమ్మకం ఉంది.

అది ఎక్కడ ఉంచితే ఆ స్థలంలో అది శాశ్వతంగా ప్రతిష్టిత మవుతుంది.

దారిలో విభీషణుడు తిరుచ్చి చేరుకో గానే అక్కడ కావేరీ నదిని చూసి అందులో స్నానం చేయాలనే ఆలోచన అతనికి వచ్చిందట.

దీంతో విగ్రహాన్ని పట్టుకునే వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించాడు.అప్పుడు గణేశుడు బాల రూపంలో ఆ ప్రాంతానికి వచ్చాడు.

విభీషణుడు రంగ నాథుని విగ్రహాన్ని చిన్నారికి అప్పగించి నేలపై ఉంచ వద్దని తెలిపాడు.విభీషణుడు వెళ్లి పోగానే వినాయకుడు ఆ విగ్రహాన్ని నేలపై ఉంచాడు.

విభీషణుడు తిరిగి వచ్చి అక్కడ కింద ఉంచిన విగ్రహాన్ని చూశాడు.విగ్రహాన్ని పైకి లేపేందుకు ఎంత గానో ప్రయత్నించాడు.

విగ్రహాన్ని కింద పెట్టిన బాలునిపై కోపగించి అతని కోసం వెతకడం ప్రారంభించాడు.ఇంతలో గణేశుడు పర్వతం పైకి పరిగెత్తాడు.

మరి ముందుకు మార్గం లేక వినాయకుడు అదే స్థలంలో కూర్చున్నాడు.విభీషణుడు ఆ పిల్లవాడిని చూడగానే కోపంతో అతని తలపై కొట్టాడు.

ఇది జరిగినప్పుడు గణేశుడు తన నిజ రూపంలో అతనికి ప్రత్యక్షమయ్యాడు.గణేశుడి నిజ స్వరూపాన్ని చూసిన విభీషణుడు క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అప్పటి నుండి గణేశుడు ఆ పర్వతం మీద కొలువై ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube