వేల సంవత్సరాల క్రితం ఉల్లి వినియోగం గురించి తెలిస్తే షాకవుతారు

పురాతన కాలం నుంచి మానవులు ఉల్లిపాయలు వాడినట్లు అనేక తార్కాణాలు కనిపించాయి.క్రీ.

 It Would Be Shocking To Know About The Consumption Of Onion Thousands Of Years A-TeluguStop.com

పూ 5,000 నాటి కాంస్య యుగం నాటి ప్రదేశాల త్రవ్వకాల్లో ఉల్లిపాయల అవశేషాలు కనుగొన బడ్డాయి.నాటి కాలంలో ఉల్లిపాయ ప్రత్యేకమైన ఉపయోగం గురించి మీరు బహుశా మీరు ఎక్కడా విని ఉండక పోవచ్చు.

శతాబ్దాల క్రితం మధ్యయుగ ఐరోపా నివాసులు అనేక రకాల ఉల్లిపాయలను ఉపయోగించారు.ఆ వివరాలు ఇప్పుడు తెలుసు కుందాం.1.పిరమిడ్లను నిర్మించిన ఈజిప్షియన్లు క్రీస్తుకు 3000 సంవత్సరాల ముందు ఉల్లిపాయలను పండించారనే ఆధారాలు లభించాయి.వారి రోజువారీ ఆహారంలో ఉల్లిపాయ ఒక భాగం.2.వారు ఉల్లిపాయలను పూజించే వారట.ఉల్లిపాయకున్న గుండ్రని ఆకారం.దానిని కత్తిరించినప్పుడు కనిపించే ఉంగరం ఆకారం కారణంగా, ఇది శాశ్వత జీవితానికి చిహ్నంగా పరిగణించే వారట.

3.ఈజిప్ట్ రాజు రామ్సెస్ IV కుచెందిన మమ్మీలో ఉల్లిపాయల అవశేషాలను కనుగొన్నారు.పురాతన ఈజిప్షియన్లు అంత్య క్రియల ప్రక్రియలో ఉల్లిపాయలను ఉపయోగించారని తెలుస్తోంది.4.పురాతన గ్రీస్‌లో ఉల్లిపాయ మానవ శరీరంలోని రక్తం సమతుల్యతను సరిచేస్తుందని నమ్మేవారట.అందుకే అథ్లెట్లు ఉల్లిపాయలను ఎక్కువగా తినేవారు.ఇది మాత్రమే కాదు, రోమన్ గ్లాడియేటర్లు తమ కండరాలను బలోపేతం చేయడానికి ఉల్లిపాయలను చర్మంపై రుద్దుకునేవారు.5.16వ శతాబ్దపు ఐరోపాలో వైద్యులు ఉల్లిపాయలను వంధ్యత్వానికి నివారణగా భావించారు.

మహిళలు ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినాలని సూచించారు.ఆ రోజుల్లో ఉల్లిపాయలను జంతువులకు కూడా తినిపించేవారు.తద్వారా అవి అత్యధిక సంఖ్యలో పిల్లలను పెట్టేవట.6.మధ్యయుగ ఐరోపాలో ఉల్లిపాయకు గొప్ప ప్రాముఖ్యత ఇచ్చారు.అద్దె చెల్లించ డానికి ఉల్లిపాయలను ఉపయోగించే వారట.నాటి ప్రజలు ఒకరికొకరు ఉల్లిపాయలను బహుమతిగా ఇచ్చేవారు.7.ఉల్లిపాయలోని కణాలు పెద్దగా ఉంటాయి.ఈ కణాల నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పటికీ అధ్యయనాలు జరగుతున్నాయి.

ఉల్లిపాయ తొక్కను సూక్ష్మదర్శిని క్రింద ఉంచినప్పుడు కణాల ఆకృతి స్పష్టంగా కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube