జైలు… ఈ పదం వింటేనే చాలా భయంకరంగా ఉంటుంది.శిక్ష ఖరారు అయిన నిందితులను ఉంచే ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా పకడ్బందీగా ఉంటుంది.
ఇక్కడ ఉన్న ఖైదీలు పారిపోదాం అనే ఆలోచనే రాకుండా ఉండాలి.లేదంటే ఆ ఆలోచన వచ్చినా వారికి అతి భయంకరంగా ఉండేలా జైలు గోడలు ఉంటాయి.
కానీ కర్నూలు జైలు మాత్రం ఇందుకు మినహాయింపు.ఎవరైనా సరే ఖైదీలు ఇట్టే తప్పించుకునేందుకు వీలుగా ఈ జైలు నిర్మాణం ఉంది.
ఇక్కడ ఒకే ఖైదీ వారం వ్యవధిలోనే ఒక్కసారి కాదు రెండు సార్లు తప్పించుకున్నాడు.ప్రస్తుతం ఖైదీ తప్పించుకోవడం జైలు అధికారులకు తలనొప్పిగా మారింది.
ఈ ఘటన మీద పై అధికారులు విచారణ చేస్తున్నారు.ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని అందరూ టెన్షన్, టెన్షన్ గా ఉంటున్నారు.
ఈ విషయంపై పోలీస్ బాస్ కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
వారం వ్యవధిలో ఒకే ఖైదీ రెండు సార్లు జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడని ఆయన అధికారులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
ఆ ఖైదీని వెంటనే పట్టుకుని మళ్లీ జైలులో బంధించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు.కర్నూలు జిల్లాలో శిక్ష అనుభవిస్తున్న నాని అనే ఖైదీ ఈ నెల 12 వ తేదీన పారిపోయాడు.
కానీ అలర్ట్ అయిన పోలీసులు పారిపోయిన ఖైదీ నానిని అదే రోజు పట్టుకున్నారు.సాధారణంగా పారిపోయిన ఖైదీని చాలా భద్రంగా ఉంచాలి.
అతడిని సపరేట్ లాకప్ లో పెట్టాలి.కానీ కర్నూలు పోలీసులు మాత్రం చాలా లైట్ తీసుకున్నారు.
దీంతో నాని మరో సారి కూడా జైలు నుంచి తప్పించుకున్నాడు.ఈ ఘటన ప్రస్తుతం జైళ్ల శాఖలో హాట్ టాపిక్ గా మారింది.
పారిపోయిన ఖైదీని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.








