తెలుగు సినీ ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.అయితే రెండేళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం వరుస రీమేక్ లతో సాగిపోతున్నాడు.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్ సినిమా కూడా హిందీ సినిమా పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన విషయం అందరికి తెలిసిందే.
అలాగే ఇటీవలే విడుదలైన భీమ్లా నాయక్ సినిమా కూడా మలయాళం లో బ్లాక్ బస్టర్ అయిన అయ్యప్పనుమ్ కోషియుం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.
అయితే పవన్ నటించిన రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే కావడం తో ప్రేక్షకులలో అలాగే అభిమానులలో ఎగ్జైట్మెంట్ తగ్గిపోయింది.పవన్ నటిస్తున్న సినిమాలో ఒక స్థాయికి మించి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోవడానికి కారణం రీమేక్ లు అని కూడా చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మరొక రీమేక్ సినిమాను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న వినోదియ సిత్తం రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్లు జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి.వినోదియ సిత్తం సినిమాలో సముద్రకని ముఖ్య పాత్రలో నటించారు.అయితే తమిళంలో సముద్రఖని చేసిన దేవదూత పాత్రనే పవన్ కళ్యాణ్ తెలుగులో చేయబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇది రొటీన్ గా ప్లాట్ గా సాగిపోయే సినిమా.
కాస్త ఎమోషనల్ గా ఉంటుంది.అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ప్రకారం చూస్తే ఇది అసలు పవన్ కళ్యాణ్ కి సెట్ అవ్వదు.
అంతే కాకుండా ఇది పవన్ కళ్యాణ్ చేయాల్సిన పాత్ర కూడా కాదు.గోపాల గోపాల సినిమా కంటే సాధారణంగా అతిధి పాత్రలో అనిపించే క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.







