ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి కొందరు చేస్తున్న తలతిక్క పనులు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.లైకులు, కామెంట్లు, షేర్లు మోజులో పడి రిస్క్‌తో కూడిన వీడియోలను కొందరు రూపొందిస్తున్నారు.
వీటిని చూసే వారికి ఎంత థ్రిల్ ఉంటుందో చేసే వారికీ అదే అనుభవం ఉంటుంది.దీని కోసం ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం లేదు.
అయినప్పటికీ కొందరు చేసే అతి వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడుతుంది.తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాలతో చేసిన వీడియో కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు.
కర్నాటకకు చెందిన మాజ్ సయ్యద్ అనే యువకుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు.దానిలో వివిధ వీడియోలను చేసి పెడుతుంటాడు.ముఖ్యంగా పాములతో అతడు చేసే వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చేది.దీంతో తాను కూడా పాములతో ఆటలు ఆడడంలో నిపుణుడనని భావించాడు.
పాముల గురించి అంతా తెలుసని అనుకున్నాడు.మామూలు పాములతో కాకుండా ఏకంగా కింగ్ కోబ్రాలతో ఓ వీడియో చేశాడు.
కింగ్ కోబ్రాలు కూడా తన మాట వింటాయని అనుకున్నాడు.వాటితో కాసేపు ఆడుతూ వీడియోలు తీస్తున్నాడు.వరుసగా మూడు కోబ్రాలు కొద్ది సేపు అతడి డైరెక్షన్‌లో ఆడాయి.ఒక్కసారిగా ఓ కింగ్ కోబ్రా అతడిపై కాటు వేసింది.
లెదర్ షూ వేసుకున్నా దాని కోరలు బలంగా దిగాయి.ఒకదాని వెంట మరొకటి కాటు వేశాయి.
ఇంతలో తన పరిస్థితి అతడికి అర్థం అయింది.పాము విషం తన శరీరంలోకి ఎక్కకుండా అతడు జాగ్రత్త పడ్డాడు.
ఆసుపత్రికి పరుగులు తీశాడు.వైద్యులు ఎంతో శ్రమించి, 46 యాంటీ వీనమ్స్ అతడి శరీరంలోకి ఎక్కించారు.
చాలా కష్టపడి అతడి ప్రాణాలను నిలిపారు.







