కార్తీకదీపం సీరియల్ కు శుభంకార్డు అప్పుడే.. అధికారికంగా ఆ క్లారిటీ ఇచ్చిన మోనిత!

బుల్లితెర సీరియళ్లలో ఒకటైన కార్తీకదీపం సీరియల్ కు ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే.అయితే ఈ మధ్య కాలంలో కార్తీకదీపం దర్శకుడు షాకింగ్ ట్విస్టులు ఇస్తూ ఈ సీరియల్ ను ప్రసారం చేస్తుండటంతో ఈ సీరియల్ అభిమానులకు అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు.

 Actress Shobha Shetty Shocking Comments About Karthikadeepam Serial Details Here-TeluguStop.com

కార్తీకదీపం సీరియల్ డైరెక్టర్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అయితే కార్తీకదీపం సీరియల్ లో మోనితగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించిన శోభాశెట్టి తాజాగా యూట్యూబ్ లో షాకింగ్ వీడియోను పోస్ట్ చేశారు.

చాలారోజుల నుంచి చాలామంది కార్తీకదీపం అయిపోతుందా అని అడుగుతున్నారని ఫైనల్లీ కార్తీకదీపం అయిపోతుందని ఈరోజు నాకు లాస్ట్ డే అని ఆమె వెల్లడించారు.మోనిత క్యారెక్టర్ ను తాను మిస్ అవుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

లైఫ్ లాంగ్ నాకు మోనిత పాత్ర గుర్తుంటుందని శోభాశెట్టి తెలిపారు.అయితే తనకు ఈరోజు లాస్ట్ డే అని సీరియల్ షూటింగ్ మాత్రం జరుగుతోందని ఆమె అన్నారు.

ఈ సీరియల్ లో మా జనరేషన్ అయిపోతుందని ఆమె చెప్పుకొచ్చారు.కార్తీకదీపం కొత్త పాత్రలతో కొనసాగుతుందని మోనిత పాత్రలో నటిస్తున్న శోభా శెట్టి క్లారిటీ ఇచ్చారు.

అయితే ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ లేకుండా ఈ సీరియల్ ఎలాంటి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

నిరుపమ్ సైతం ఈ సీరియల్ లో ఇక కనిపించినని వెల్లడించారని సమాచారం అందుతోంది.కార్తీకదీపంలో జనరేషన్ ను ఛేంజ్ చేస్తూ దర్శకుడు తీసుకున్న నిర్ణయం ఈ సీరియల్ అభిమానులకు కూడా నచ్చడం లేదు.కార్తీకదీపం సీరియల్ మరో రెండు మూడేళ్లు కొనసాగుతుందని శోభాశెట్టి పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు.

ఎంతోమంది కెరీర్ ను ఈ సీరియల్ మలుపు తిప్పిందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube