సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.ముఖ్యంగా ఫుడ్ కు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.
వాటిలో కొన్ని నెటిజన్లు బాగా ఆకట్టు కుంటాయి.మరికొన్ని మాత్రం చూసే వారికి విరక్తి, అసహ్యం కలిగిస్తాయి.
ఈ తరహా వీడియోలు చేస్తే అసలు ఇలా కూడా ఫుడ్ చేస్తారా అనేలా ఉంటాయి.ఇక మిగతావి మాత్రం మాత్రం బాగా క్లిక్ అయ్యి విశేషంగా అందరినీ మెప్పిస్తాయి.
ఇప్పటి వరకు ఎన్నో కొత్త వెరైటీ వంటలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.ఉదాహరణకు పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే ఓరియో బిస్కెట్స్ తో పకోడి, చాక్లెట్ తో పానీపూరి, ఐస్ క్రీమ్ సమోసా, మ్యాగీతో వెరైటీ వంట ఇలా చాలా రకాల వంటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక వెరైటీ వంట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు గులాబ్ జామున్ అంటే ఎంతో ఇష్టంగా లోట్టలు వేసుకుంటూ మరి తింటూ ఉంటారు కదా.
మరి అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ గులాబ్ జామూన్ తో ఒక వీధి వ్యాపారి విచిత్రమైన వంటను చేసి దానికి గులాబ్ జామూన్ పరోటా అని పేరు పెట్టాడు.ముందుగా ఒక పరోటాను చేసి అందులో రెండు గులాబ్ జామూన్లు పెట్టి మళ్ళీ పరోటాను రౌండ్ గా చుట్టేస్తాడు.ఆ తరువాత పరోటాను మళ్ళీ చపాతీ కర్రతో మెల్లగా ఒత్తి పరోటాలో చేసి పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా ఎర్రగా కాలుస్తాడు.తరువాత దానిపై గులాబ్ జామూన్ రసం వేసి ఇస్తాడు.
అంతే గులాబ్ జామూన్ పరోటా రెడీ అయినట్లే.ఈ వెరైటీ రెసిపీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో సోనియా నేగి అనే ఫుడ్ బ్లాగర్ షేర్చేశారు.
ఈ వీడియో చూసిన నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది.కొందరు ఈ రెసిపీ బాగుందని కామెంట్ చేస్తే మరి కొందరు మాత్రం ఇదెక్కడి వంటకం అంటూ పెదవి విరుస్తున్నారు.