కువైట్ మరో కీలక నిర్ణయం...30 నుంచీ 90 రోజుల తాత్కాలిక పొడిగింపు...!!

కువైట్ ప్రభుత్వం వలస వాసుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శనాత్మకంగా ఉన్నా అక్కడి రూల్స్ ను ప్రతీ ఒక్క వలస వాసులు పాటించాల్సిందే.

ఇష్టం ఉంటే  ఉండండి, కష్టం అనుకుంటే వెళ్ళిపొండి అన్నట్టుగా ఉంది కువైట్ లో వలస వాసుల పరిస్థితి.

ముఖ్యంగా కువైట్ లో అత్యధికంగా ఉండే భారత వలస వాసులు కువైట్ తీసుకుంటున్న నిర్ణయాలతో విసిగి వేసారిపోతున్నారు.ఇప్పటికే కువైటైజేషన్ పేరుతో ఉద్యోగాలు ఊడపీకేస్తున్న కువైట్ గడిచిన ఏడాదిగా 60 ఏళ్ళు దాటిని వలస వాసుల విషయంలో ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకుంటూ పొమ్మన లేక పొగ పెడుతోంది.

గతంలో 60 ఏళ్ళు దాటిన వలస వాసులు అసలు కువైట్ లో ఉండ రాదంటూ ప్రకటించిన కువైట్ ఆ తరువాత 60 ఏళ్ళు పై బడిన వారు హై స్కూల్ స్థాయి అర్హత గల సర్టిఫికెట్, అలాగే అత్యధిక జీతం ఉండాలని అంటూ కండిషన్లు పెడుతూ వారి పర్మిట్ రెన్యువల్ కోసం భారీ ఫీజులు చెల్లించాలని ఆదేశించింది.దాంతో 60 ఏళ్ళు పై బడిన వారు పలు రకాలుగా చేసుకున్న విజ్ఞప్తుల కారణంగా గతంలో విధించిన కొన్ని నిభంధనలను సడలిస్తూ కేవలం పర్మిట్ రెన్యువల్ కోసం రూ.61 వేలు, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఫీజుల కోసం.రూ.1.23 లక్షలు చెల్లించి పర్మిట్ లను రెన్యువల్ చేసుకోవాలని ఈ ఫీజుల విషయంలో ఇకపై ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది.అయితే కొంత కాలం 60 ఏళ్ళు పై బడిన వారి పర్మిట్ విషయంలో కొంత సందిగ్ధత నెలకొన్న నేపధ్యంలో రెన్యువల్ గడువు ముగింపుకు రాగ మళ్ళీ 30 రోజుల నుంచీ 90 రోజుల వరకూ తాత్కాలిక పొడిగింపు ఇచ్చింది.

అయితే ఈ పొడిగింపు లో కూడా కువైట్ డబ్బులు వసూలు చేస్తోంది.ఈ పొడిగింపుకు గాను రోజుకు కువైట్ ప్రభుత్వం రెండు దినార్లు వసూలు చేసింది.ఇక పై ఎలాంటి పొడిగింపులు ఉండవని అందుకోసం ఎవరూ ఎదురు చూడవద్దని ప్రకటించింది.

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు