మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ. 197తో 150 రోజుల వ్యాలిడిటీ పొందండిలా..

ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీ కోసం కనీసం రూ.100కు పైగానే వెచ్చించాల్సి వస్తోంది.

ఇక 56 రోజులు, 84 రోజుల కోసం కనీసం రూ.400 ఖర్చు చేయాల్సి వస్తోంది.అందుకే చాలామంది పేద, మధ్యతరగతి ప్రజలు రీఛార్జ్ చేసుకోవాలంటే భయపడిపోతున్నారు.

కనీసం ఇన్‌కమింగ్‌ కాల్స్ రిసీవ్ చేసుకోవాలనుకున్నా వందల రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.రీఛార్జి ధరలు తమకు అందుబాటులో లేక చాలా మంది మొబైల్ యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కేవలం 197 రూపాయలకే 150 రోజులు వ్యాలిడిటీ అందిస్తోంది.ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న యూజర్లు కంటిన్యూగా 150 రోజుల పాటు ఇన్‌కమింగ్‌ కాల్స్ పొందొచ్చు.ఐదు నెలల పాటు బంధుమిత్రుల నుంచి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునేందుకు జస్ట్ రూ.197 రూపాయలు వెచ్చిస్తే సరి పోతుంది.అయితే ఈ ప్లాన్ తో ఇంకా మరెన్నో బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.

అవేమిటో ఇప్పుడు చూద్దాం.రూ.197 బీఎస్ఎన్ఎల్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 150 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది.అలాగే 18 రోజుల పాటు రోజుకి 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు.

Advertisement

18 రోజుల తర్వాత ఈ బెనిఫిట్స్ అందు బాటులో ఉండవు.ఒకవేళ మీకు కాల్స్ లేదా డేటా ఫెసిలిటీ కావాలనుకుంటే తక్కువ ధరకే టాప్ అప్ ప్లాన్స్ తీసుకోవచ్చు.ఈ ప్లాన్ ప్రధాన లక్ష్యం ఏంటంటే తక్కువ ధరకే ఎక్కువ కాలంపాటు వ్యాలిడిటీ అందించడం.దీనిద్వారా నెలకి రూ.20 రూపాయల తోనే ఇన్‌కమింగ్‌ కాల్స్ ఫెసిలిటీ పొందడం సాధ్యమవుతుంది.అలాగే 40 కేబీపీఎస్ బ్రౌజింగ్ స్పీడ్ 150 రోజుల వరకు ఆస్వాదించవచ్చు.

ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా అందుకోవచ్చు.ముందుగా చెప్పినట్లుగా 18 రోజుల పాటు మీరు డైలీ 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందొచ్చు.ఇలా ఏ కోణంలో చూసుకున్నా పైసా వసూలు ప్లాన్ గా రూ.197 రీఛార్జ్ ప్లాన్ నిలుస్తోంది.కేవలం ఇన్‌కమింగ్‌ కాల్స్ సర్వీస్ కావాలనుకున్న యూజర్లకు ఇది మరింత ఉపయుక్తంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు