ఇసుకపల్లి సముద్ర తీర ప్రాంతంలో వెదురు బొంగులు తో కూడిన తెప్ప స్థానిక మత్స్యకారులు గుర్తించారు.సముద్రంలో కిలోమీటర్ల దూరంలో ఉన్న తెప్పను గొడవలతో ఒడ్డుకు చేర్చారు.
తెప్ప నందు బుద్ధుడి విగ్రహం శివలింగంను గుర్తించిన మత్స్యకారులు నరేన్ పోలీసులకు సమాచారం అందించారు .
నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామ సముద్ర తీర ప్రాంతానికి కిలోమీటర్ల దూరంలో వెదురుబొంగులా తో తయారు చేసిన తెప్పను స్థానిక మత్స్యకారులు గుర్తించారు.స్థానిక మత్స్యకారులు సహకారంతో సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.సమీపంలోని దేశాలకు సంబంధించిన తెప్పగా మెరైన్ పోలీసులు అనుమానిస్తున్నారు.తెప్పలో బుద్ధుడి విగ్రహం శివలింగం ఉన్నాయని క్లూస్ టీం మరియు బాంబు స్క్వాడ్ సహకారంతో పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలియజేశారు.