బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ కు సినిమా ఆఫర్?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అందరికీ సుపరిచితమైన సాయి తేజ్ ఉరఫ్ ప్రియాంక సింగ్ గురించి అందరికీ తెలిసిందే.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం లింగ మార్పిడి ద్వారా ప్రియాంక సింగ్ గా మారిన ఈమె బిగ్ బాస్ సీజన్ ద్వారా అందరికీ సుపరిచితం అయ్యారు.

ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక సింగ్ 12 వారాల వరకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగి విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు.బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక సింగ్ తన ఫర్ఫార్మెన్స్ ద్వారా మాత్రమే కాకుండా కంటెస్టెంట్ మానస్ తో కలిసి ఈమె నడిపిన ప్రేమ వ్యవహారం అందరిని ఆకట్టుకుంది.

ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రియాంక సింగ్ కు ఒక సినిమా అవకాశం వచ్చిందని తెలుస్తుంది.ప్రముఖ నిర్మాత రచయిత కోన వెంకట్ తన సినిమాలో ప్రియాంక సింగ్ కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ప్రియాంక సింగ్ నిర్మాత కోన వెంకట్ ను కలిసిన ఫోటోని షేర్ చేస్తూ.త్వరలోనే ఒక ఎక్సైట్మెంట్ తో రాబోతున్నాం కోన వెంకట్ తో కలిసి టైం స్పెండ్ చేయడం ఆనందంగా ఉంది అంటూ తెలిపిన ప్రియాంక సింగ్ సినిమాకు సంబంధించిన విషయాలను మాత్రం వెల్లడించలేదు.అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు