పుష్ప ది రూల్ లో పుష్పరాజ్ కు వెన్నుపోటు.. ట్విస్ట్ అదిరింది..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.

ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్ట్ సుకుమార్ డైరెక్ట్ చేసాడు.

ఈయన డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టిందనే చెప్పాలి.ఈ సినిమా హిందీ మార్కెట్ లో అందుకున్న విజయం బన్నీ కెరీర్ ను టాప్ లో నిలబెట్టింది.

ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమా హిందీ మార్కెట్ లో హవా చూపించింది.ఇక ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇప్పటికే పుష్ప ది రైజ్ పేరుతో మొదటి పార్ట్ ను రిలీజ్ చేయగా ఇక ఇప్పుడు పుష్ప ది రూల్ పేరుతో రెండవ పార్ట్ ను రెడీ చేస్తున్నాడు సుకుమార్.ఫిబ్రవరిలో పుష్ప 2 సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇప్పటికే సుకుమార్ అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో తాజాగా పుష్ప ది రూల్ నుండి ఒక వార్త బయటకు వచ్చింది.

ఈ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

పుష్ప ది రూల్ లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఉండనుందని సమాచారం.ఈ సినిమా పార్ట్ 1లో పుష్ప పక్కన ఉండే కేశవాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే పార్ట్ 2లో పుష్పరాజ్ కి కేశవా వెన్నుపోటు పొడవనున్నాడని దాంతో  పుష్ప కొత్త చిక్కులు ఎదుర్కోబోతున్నాడని టాక్.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

అదే సమయంలో పార్ట్ 1లో విలన్స్ గా కనిపించిన జాల్ రెడ్డి, మంగళం శీను, దాక్షాయణి పుష్పాపై ప్రతీకారం తీర్చుకోబోతున్నారని.అలాగే షికావత్ కూడా పుష్పపై పగ తీర్చుకుంటాడని మీడియాలో వార్తలు ప్రచారం జరుగు తున్నాయి.

Advertisement

నిజమెంతో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు