బీజేపీ దూకుడుకి అసలు కారణం ఇదా ?

తెలంగాణలో బీజేపీ  స్పీడ్ పెరిగింది.గతంలో మాదిరిగా కాకుండా, ఆ పార్టీలోని నాయకులు అందరిలోనూ అధికారంలోకి పార్టీని తీసుకురావాలనే కసి కనిపిస్తోంది.

కొంచెం కష్టపడితే టిఆర్ఎస్ ను ఓడించి , తెలంగాణ అధికార పీఠాన్ని దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న నమ్మకము పార్టీ నేతల్లో కనిపిస్తోంది.బీజేపీ అధిష్టానం పెద్దలు సైతం టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా తెలంగాణ బీజేపీ  నేతలు చేస్తున్న పోరాటాలకు మద్దతు పలుకుతూ,  తమదైన శైలిలో సహకారం అందిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా,  అప్పుడే ఎన్నికలు వచ్చేశాయా అన్నట్టుగా తెలంగాణ రాజకీయ నెలకొంది.టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా ప్రతి సమస్య పైన బీజేపీ పోరాటం చేస్తోంది.బీజేపీ నీ ఇరుకున పెట్టేలా టిఆర్ఎస్ వరి ధాన్యం కొనుగోలు వ్యవహారాన్ని తెరపైకి తేవడం, తెలంగాణకు అన్ని విషయాల్లోనూ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందనే భావన ప్రజల్లో కల్పించడం ఇలా ఎన్నో వ్యవహారాలు చేస్తుండడంతో బీజేపీ  మరింతగా దూకుడు పెంచింది.317 జీవో కు వ్యతిరేకంగా బీజేపీ  ఉద్యమం చేపట్టింది.ఈ వ్యవహారంలో నే  తెలంగాణ బీజేపీ  అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టయ్యారు.

ఇక ఆ తర్వాత తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది.అయితే బీజేపీ  ఇంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఏమిటా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.2014 ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్ 2019 వరకు సమయం ఉన్నా, ఒకే ఏడాది ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లింది.

Advertisement

అయితే మళ్ళీ 2023 లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా,  కాస్త ముందస్తుగానే అంటే 2022 లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.అందుకే 119 నియోజకవర్గాల్లోనూ బీజేపీకి గట్టు పట్టు ఉండేలా పెద్దఎత్తున పార్టీలోకి చేరికలు ప్రోత్సహించే విధంగా తెలంగాణ బీజేపీ  నేతలు వ్యూహాలు పన్నుతున్నారు.ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా బీజేపీ దృష్టిపెట్టింది.

దీనికోసం పార్టీ తరఫున కమిటీని నియమించింది.ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ చేరికలు ఉండేలా ప్లాన్ చేసుకుంది.

ఇదేవిధంగా మరెన్నో దూకుడు చర్యలను తీసుకుంటూ బీజేపీ  ముందుకు వెళుతోంది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు