నాని అంటే సుందరానికి అక్కడ షూటింగ్..!

శ్యామ్ సింగ రాయ్ తో సూపర్ హిట్ అందుకున్న నాని తన నెక్స్ట్ సినిమా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.

అంటే సుందరానికీ అంటూ రాబోతున్న నాని ఈ సినిమాతో మళయాళ హీరోయిన్ నజ్రియాతో జోడీ కడుతున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం మాల్దీవ్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమా కోసం చిత్రయూనిట్ మాల్దీవ్స్ షిఫ్ట్ అయ్యారు.

అక్కడ 20 రోజుల పాటు షెడ్యూల్ ఉంటుందని టాక్.శ్యామ్ సింగ రాయ్ హిట్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన నాని అంటే సుందరానికీతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

ఈ సినిమాని కూడా శ్యామ్ సింగ రాయ్ తరహాలో సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారని టాక్.తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

అంటే సుందరానికీ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది.ఈ సినిమాలో నాని సుందర వర ప్రసాద్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత నాని రాజేష్ ఓదెల డైరక్షన్ లో దసరా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తెలంగాణా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది.

నాని దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement
" autoplay>

తాజా వార్తలు