2021 : ఈ ఏడాది బెస్ట్ సపోర్టింగ్ రోల్స్ ఇవే..

సినిమా అంటే హీరో, హీరోయిన్లు చక్కగా నటిస్తే సరిపోదు.ప్రతి ఒక్క క్యారెక్టర్ అద్భుతంగా రావాలి.

మిగతా నటీనటులు కూడా అద్భుత నటన కనబర్చాలి.అన్ని పాత్రలు అనుకున్నట్లు నటిస్తేనే సినిమా అనేది మంచి విజయాన్ని అందుకుంటుంది.

ఈ ఏడాది రిలీజ్ అయిన పలు సినిమాల్లో కొన్ని అద్భుతమైన క్యారెక్టర్లు ఉన్నాయి.హీరో, హీరోయిన్లతో పోల్చితే వారి పాత్రలే ఆయా సినిమాలకు హైలెట్ గా నిలిచాయి కూడా ఇంతకీ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించిన నటీ నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జగదీష్ బండారీ- పుష్పఈ సినిమాలో అల్లు అర్జున్ తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగదీష్ బండారి.ఈ సినిమాకు ముందు ఇతడు కొన్ని సినిమాల్లో నటించినా.అంతగా జనాలకు తెలియదు.

Advertisement

ఈ సినిమాలో ఆయన రాత మారిపోయిందని చెప్పుకోవచ్చు.సుకుమార్ సినిమాతో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుగా మారిపోయాడు.వరలక్ష్మి శరత్ కుమార్- క్రాక్

రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర చేసింది వరలక్ష్మి.ఈ పాత్రలో తను తప్ప ఎవరు చేసినా అంతగా ఆదరణ దక్కించుకోలేదు అన్నట్లుగా నటించింది.ఇప్పుడు ఆమె అసలు పేరు కంటే.

జయమ్మగానే చాలా మంది పిలుస్తున్నారు.ప్రకాశ్ రాజ్- వకీల్ సాబ్

వకీల్ సాబ్‌ సినిమాలో పవన్‌ కల్యాణ్ తో పోటా పోటీగా నటించాడు ప్రకాష్ రాజ్.లాయర్ నంద పాత్రలో మరోసారి అద్భుత నటన కనబర్చాడు.ప్రకాశ్ రాజ్ పాత్ర ఎంటర్ అయిన తర్వాత వకీల్ సాబ్ సినిమా ఓ రేంజిలో ముందుకు సాగుతుంది.జగపతిబాబు- అఖండ

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

బాలయ్య అఖండ సినిమాలో జగపతిబాబు అద్భుతంగా నటించాడు.అఘోర బాబ పాత్రలో ఒదిగిపోయి నటించాడు.రమ్యకృష్ణ- రిపబ్లిక్

Advertisement

సాయి ధరమ్ తేజ్ మూవీ రిపబ్లిక్ లో ముఖ్యమంత్రి విశాఖ వాణి గా నటించింది రమ్య.రాజకీయ నాయకురాలిగా అద్భుత ప్రదర్శన కనబర్చింది.రాజీవ్ కనకాల- నారప్ప

వెంకటేష్ మూవీ నారప్పలో బసవయ్య పాత్రలో నటించాడు రాజీవ్.వెంకీ బావ మరిదిగా అద్భుతంగా నటించాడు.ఈ సినిమా కథ ముందుకు సాగడంలో ఆయన క్యారెక్టర్ కీ  అని చెప్పుకోవచ్చు.రాహుల్ రామకృష్ణ- జాతి రత్నాలు

కామెడీ సినిమా జాతి రత్నాలు సినిమాలో రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర చేశాడు.నా వల్లే ప్రాబ్లమ్ అయితే నేనెళ్లిపోతరా ఈన్నుంచి అంటూ ఆయన చెప్పే డైలాగ్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది.కాజల్ అగర్వాల్- మోసగాళ్లు

మంచు విష్ణు మూవీలో కాజల్ అనుగా నటించి ఆకట్టుకుంది.సినిమా ఫ్లాప్ అయినా.కాజల్ పాత్ర అద్భుతంగా నిలిచింది.

" autoplay>

తాజా వార్తలు