అయ్యయ్యో కోడి ఎంత పని చేసింది.. కోడి వల్ల కోర్టుకు వెళ్లిన దంపతులు!

అయ్యయ్యో కోడి ఎంత పని చేసింది.ఏకంగా దంపతులని కోర్టు వరకు తీసుకు వెళ్ళింది.

మాములుగా మన ఇండియాలో కోడి ఏం చేసిన మనం పెద్దగా పట్టించుకోము.కానీ విదేశాల్లో అలా కాదు.

ఏ చిన్న రూల్ పాటించక పోయిన కోర్టు పెద్ద పనిష్మెంట్ ఇస్తుంది.తాజాగా ఇలానే కోడి వల్ల ఒక దంపతులు కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది.

అలెగ్జాన్డర్, లొర్రాన్ బర్ గ్రీన్ దంపతులకు కొన్ని కోళ్లు ఉన్నాయట.వాటిలో కోడి పుంజు కూడా ఉంది.కానీ అది అన్ని కోళ్లలా కుదురుగా ఉండేది కాదట.

Advertisement

ఎప్పుడు అరుస్తూనే ఉండేదట.తెల్లారి సమయంలోనే కాదట.

అది రోజంతా అరుస్తూనే ఉండేది అట.దాంతో చుట్టుపక్కల వారు అంత ఆ కోడి పుంజు గోలకు తలలు పట్టుకున్నారు.కోడి పుంజు గోల భరించలేము.

దాన్ని సైలెంట్ గా ఉంచండి.అని ఆ దంపతులకు చాలాసార్లు చెప్పిన కూడా వారు ఎంత మాత్రం కూడా పట్టించుకోలేదట.

కానీ అందులో వారి తప్పు కూడా ఏ మాత్రం లేదు.అస్తమాను ఆ కోడిని కంట్రోల్ లో ఉంచలేము కదా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అలాగే ఆ దంపతుల వల్ల కూడా కాలేదు.అయితే చుట్టూ పక్కల వారు మాత్రం ఆ కోడి న్యూసెన్స్ చేస్తుంది అంటూ కేసు పెట్టారు.

Advertisement

దాంతో ఆ కేసు కోర్టుకు వెళ్ళింది.కోర్టు ఆ దంపతులకు నోటిస్ పంపింది.

ఇదంతా 2018 లో జరిగింది.ఇలా కోడి రావడమే కాకుండా.

ఆ కోళ్లకు వేసే ఆహారం ఎలుకలు తిని అవి అనారోగ్యం బారిన పడుతున్నాయని ఆ ఎలుకలు ఇళ్లలోకి కూడా వస్తున్నాయి అని స్థానికులు కేసు పెట్టారు.ఈ కేసుపై తీర్పు ఇవ్వడమే కాదు వారికీ జరిమానా కూడా విధించింది.

కోర్టు ఖర్చుల క్రింద 10 వేల రూపాయలు, బాధితులు సర్ ఛార్జి కింద 2200 రూపాయలు చెల్లించాలని చెప్పింది.ఆ డబ్బును 12 నెలల్లో చెల్లించాలని కండిషన్ పెట్టింది కోర్టు.

తాజా వార్తలు