పుష్పలో ఐటెం సాంగ్ కు సుకుమార్ సమంతను ఎలా ఒప్పించారు?

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి ఒక్క సినిమాకి కూడా ఓ లెక్క ఉంటుంది.

ప్రతి ఒక్క సన్నివేశం విషయంలోనూ ప్రతి ఒక్క పాత్ర విషయంలోనూ ఆయన ఏమాత్రం అంచనాలను తప్పరు అనే విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఎన్నో సినిమాల ద్వారా సుకుమార్ మార్క్ ఏంటో చూపించారు.ఇదిలా ఉండగా తాజాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో పుష్ప చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా కొద్దిగా మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ వసూళ్ళ పరంగా మాత్రం భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది.ఇక సుకుమార్ సినిమా అంటే ప్రతి ఒక్క సినిమాలో ఐటమ్ సాంగ్ తప్పనిసరిగా ఉంటుంది.

ఇప్పటికే రింగరింగా జిగేలురాణి వంటి పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో వీటిని మించి ఐటమ్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేశారు.

Advertisement

ఇక ఈ పాటలో నటించడం కోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతను ఎంపిక చేశారు.ఇలా సమంత ఈ పాటలో నటించడం కోసం సుకుమార్ చాలా ప్రయత్నాలు చేసి ఒప్పించారని తెలుస్తోంది.

ముందుగా ఈ పాటలో నటించడం కోసం సమంతని సంప్రదించగా సమంత ఇందులో నటించడానికి ఒప్పుకోలేదు.ఇలాంటి పాటలు నాకంతగా సెట్ అవని ఆమె ఈ పాటలో నటించడానికి తిరస్కరించింది.ఈ క్రమంలోనే సుకుమార్ ప్రస్తుతం ఎంతోమంది అగ్ర తారలు కూడా ఈ విధమైనటువంటి ఐటమ్ సాంగ్స్ లో నటిస్తున్నారు.

ఇందులో మీరు నటిస్తే ప్రేక్షకులు ఒక కొత్త సమంతను చూస్తారు అంటూ సుకుమార్ కన్విన్స్ చేసి ఈ పాటలో నటించడానికి ఒప్పించినట్లు తెలిపారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు